Share News

kumaram bheem asifabad- ఘనంగా మహాద్‌ సత్యగ్రహ దినోత్సవం

ABN , Publish Date - Mar 20 , 2026 | 11:10 PM

మండల కేంద్రంలోని జైత్వాన్‌ బుద్ధ విహార్‌లో శుక్రవారం మహాద్‌ సత్యగ్రహ దినోత్సవాన్ని అంబేద్కర్‌ యువజన సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమ బుద్ధుడు, అంబేద్కర్‌ చిత్రపటాలకు ఫూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీఎస్‌ఐ జిల్లా అధ్యక్షుడు మహోల్‌కార్‌ అశోక్‌ మాట్లాడుతూ 1927లో మహారాష్ట్రలోని మహద్‌ పట్టణంలో అంబేద్కర్‌ నాయకత్వంలో జరిగిన ఈ సత్యాగ్రహం భారత చరిత్రలో ఒక కీలక ఘట్టమని వివరించారు

kumaram bheem asifabad- ఘనంగా మహాద్‌ సత్యగ్రహ దినోత్సవం
అంబేద్కర్‌ చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న నాయకులు

వాంకిడి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని జైత్వాన్‌ బుద్ధ విహార్‌లో శుక్రవారం మహాద్‌ సత్యగ్రహ దినోత్సవాన్ని అంబేద్కర్‌ యువజన సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమ బుద్ధుడు, అంబేద్కర్‌ చిత్రపటాలకు ఫూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీఎస్‌ఐ జిల్లా అధ్యక్షుడు మహోల్‌కార్‌ అశోక్‌ మాట్లాడుతూ 1927లో మహారాష్ట్రలోని మహద్‌ పట్టణంలో అంబేద్కర్‌ నాయకత్వంలో జరిగిన ఈ సత్యాగ్రహం భారత చరిత్రలో ఒక కీలక ఘట్టమని వివరించారు. అప్పుడు దళితులకు ప్రజా తాగునీటి వనరులైన చెరువులు, కుంటలు ఉపయోగించే హక్కు లేకపోవడంతో అంబేద్కర్‌ చవ్దార్‌ ట్యాంక్‌ వద్దకు వెళ్లి నీరు తాగి సమాన హక్కుల కోసం చారిత్రక పోరాటాన్ని ప్రారంభించారని చెప్పారు. ఈ సత్యాగ్రహం ద్వారా అంబేడ్కర్‌ సమాజంలో సమానత్వం, మానవ హక్కుల ప్రా ముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. తాగునీటటి హక్కు కోంస ఆయన చేసిన ఈ ఉద్యమం దళితుల ఆత్మగౌరవాన్ని పెంచి, సామాజిక న్యాయ సాధనకు దారి తీసిందని తెలిపారు. అంబేద్కర్‌ చూపిన మార్గం అనుసరిస్తూ సమాన హక్కుల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అంబేద్కర్‌ యువజన సంఘం నాయకులు దుర్గం దుర్గాజీ, విజయ్‌, దుర్గం శ్యాంరావు, రాజేశ్వర్‌, వినేష్‌, రోహన్‌, విఠ్టల్‌, రమేశ్‌, ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు

Updated Date - Mar 20 , 2026 | 11:10 PM