ఖైదీ పరారీ కేసులో జైలు సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు
ABN , Publish Date - Jul 12 , 2026 | 06:28 AM
మహబూబ్‌నగర్ జిల్లా జైలు నుంచి ఓ ఖైదీ పరారైన ఘటనలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన సూపరింటెండెంట్‌పై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు.డీజీ సౌమ్యా మిశ్రా ఆదేశాల మేరకు..
హైదరాబాద్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్ జిల్లా జైలు నుంచి ఓ ఖైదీ పరారైన ఘటనలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన సూపరింటెండెంట్‌పై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు.డీజీ సౌమ్యా మిశ్రా ఆదేశాల మేరకు డీఐజీ శ్రీనివాస్ ఖైదీ పరారీపై సమగ్ర విచారణ జరిపారు. ఖైదీ పారిపోవడానికి జైలు సూపరింటెండెంట్ శశికాంత్ నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా గుర్తించారు. దీంతో శశికాంత్‌ను చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో చంచల్‌గూడ జైలు నుంచి కాళీదాసును నియమిస్తూ డీజీ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు వార్డెన్లను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు మరికొందరికి చార్జ్ మెమోలు ఇచ్చారు. వనపర్తి జిల్లా అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన కిశోర్ కుమార్ రెడ్డి సమీప బంధువైన బాలికను ప్రేమ వివాహం చేసుకున్నాడు. తమ కూతురు మైనర్ అని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కిశోర్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. కోర్టులో అతడిని హాజరుపరిచి జూన్ 12న జైలుకు తరలించారు. కిషోర్ ఈ నెల 6న జైలు గోడ దూకి పారిపోయాడు.