మహబూబాబాద్ ఘటనలో చికిత్స పొందుతూ ప్రియుడి మృతి
ABN , Publish Date - Feb 19 , 2026 | 05:06 AM
వివాహానికి ఒప్పుకోలేదనే కోపంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రం ప్రగతినగర్‌లో ఓ మహిళపై పెట్రోల్ పోసి తానూ నిప్పుంటించుకున్న ఘటనలో తీవ్రంగా గాయపడిన కుంట...
మహబూబాబాద్ క్రైం(ఆంధ్రజ్యోతి): వివాహానికి ఒప్పుకోలేదనే కోపంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రం ప్రగతినగర్‌లో ఓ మహిళపై పెట్రోల్ పోసి తానూ నిప్పుంటించుకున్న ఘటనలో తీవ్రంగా గాయపడిన కుంట అంజ య్య (45) చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రగతినగర్ కాలనీలోని ఓ అద్దె ఇంట్లో పాల దుకాణం నిర్వహిస్తున్న అంజయ్యకు అదే కాలనీలో కూరగాయల వ్యాపారం చేసుకుంటున్న బానోతు సంధ్యకు వివాహేతర సంబంధం ఏర్పడింది. సంధ్య వివాహానికి ఒప్పుకోలేదనే కోపంతో మంగళవారం ఆమెపై అంజయ్య పెట్రోల్ పోసి, హత్తుకొని నిప్పు అంటించుకున్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇరువురిని స్థానికులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అంజయ్య బుధవారం మృతి చెందగా, సంధ్య మృత్యువుతో పోరాడుతోందని సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.