జాతరలో బైక్‌లపై మంత్రులు
ABN , Publish Date - Jan 30 , 2026 | 04:17 AM
మహా జాతరలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? నేరుగా పరిశీలిస్తేనే స్పష్టత వస్తుందనుకున్నారో ఏమో.. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ద్విచక్రవాహనాలు ఎక్కారు.
ఏర్పాట్లను పరిశీలించిన పొంగులేటి, అడ్లూరి
మేడారం,జనవరి 29 (ఆంధ్రజ్యోతి): మహా జాతరలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? నేరుగా పరిశీలిస్తేనే స్పష్టత వస్తుందనుకున్నారో ఏమో.. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ద్విచక్రవాహనాలు ఎక్కారు. స్వయంగా నడుపుతూ జాతరంతా తిరిగారు. ఇద్దరు మంత్రులు రెండ్రోజులుగా మేడారంలోనే ఉన్నారు. గురువారం పొంగులేటి బైక్ కిక్ కొట్టి.. ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్‌ను వెనుక కూర్చోబెట్టుకొని జాతరలో చక్కర్లు కొట్టారు. లక్ష్మణ్ కుమార్ కూడా మరో బైక్‌ను నడుపుతూ జాతరలో తిరిగారు. క్యూలైన్లలో వసతులు ఎలా ఉన్నాయి? సౌకర్యాలు బాగున్నాయా? అంటూ భక్తులను అడిగి తెలుసుకున్నారు. జంపన్నవాగు వద్దకు వెళ్లి స్నానఘట్టాల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. చెత్త పేరుకుపోయిన చోట ఆగి సంబంధిత అధికారులను నిలదీశారు.