kumaram bheem asifabad- మగువా.. నీకు వందనం
ABN , Publish Date - Mar 07 , 2026 | 11:20 PM
తల్లిగా.. భార్యగా.. అక్కగా.. చెల్లిగా.. బిడ్డగా.. స్నేహితురాలిగా .. ఇలా పలు విధాలుగా మగువ తన జీవితంలో నడుస్తూ సమస్త మానవాళిని నడిపిస్తున్న తీరు వర్ణనాతీతం. ఎక్కడో బయటకు కనపడడానికి కష్టంగా ఉన్న రోజుల నుంచి ఇప్పుడు అన్నింటికీ ముందుండి నడిపించే స్థాయికి మహిళ చేరు కోవడం గొప్ప పరిణామం. ‘ఏదైనా చెప్పాలనుకుంటే మగవాళ్లకు చెప్పండి.. ఏదైనా చేయాలనుకుంటే మాత్రం ఆడవాళ్లను అడగండి’ అని ప్రపంచ మేధావులు కీర్తించారంటే మానవ జీవితంలో మహిళల పాత్ర ఏపాటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. దేశానికి రాజైనా ఓ తల్లికి బిడ్డేగా.. అన్న మాటలు అమ్మ గొప్పతనాన్ని ఎల్లప్పుడూ స్తుతిస్తూనే ఉంటాయి.
- అన్ని రంగాల్లోనూ రాణిస్తున్న అతివలు
- నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
ఆసిఫాబాద్ మార్చి 7 (ఆంధ్రజ్యోతి): తల్లిగా.. భార్యగా.. అక్కగా.. చెల్లిగా.. బిడ్డగా.. స్నేహితురాలిగా .. ఇలా పలు విధాలుగా మగువ తన జీవితంలో నడుస్తూ సమస్త మానవాళిని నడిపిస్తున్న తీరు వర్ణనాతీతం. ఎక్కడో బయటకు కనపడడానికి కష్టంగా ఉన్న రోజుల నుంచి ఇప్పుడు అన్నింటికీ ముందుండి నడిపించే స్థాయికి మహిళ చేరు కోవడం గొప్ప పరిణామం. ‘ఏదైనా చెప్పాలనుకుంటే మగవాళ్లకు చెప్పండి.. ఏదైనా చేయాలనుకుంటే మాత్రం ఆడవాళ్లను అడగండి’ అని ప్రపంచ మేధావులు కీర్తించారంటే మానవ జీవితంలో మహిళల పాత్ర ఏపాటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. దేశానికి రాజైనా ఓ తల్లికి బిడ్డేగా.. అన్న మాటలు అమ్మ గొప్పతనాన్ని ఎల్లప్పుడూ స్తుతిస్తూనే ఉంటాయి. ప్రస్తుతం ఆ రంగం.. ఈ రంగం.. అన్న తేడా లేదు. ఈ ప్రపంచంలో పురుషులు చేసే ప్రతీ పనిని మహిళలు చేయగలిగే స్థాయికి చేరుకున్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..
ప్రజలకు సేవ చేసేందుకే..
- కె. హరిత, కుమరం భీం జిల్లా కలెక్టర్
కలెక్టర్‌గా ప్రజలకు సేవ చేసేందుకు 24 గంటల పాటు అందుబాటులో ఉంటాను. కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకొని ఆరు వారాలు గడిచింది. ఇక్కడ కలెక్టర్‌గా పని చేయడం సంతృప్తినిచ్చింది. ప్రజల బాధను అర్థం చేసుకొని పరిష్కరించే అవకాశం జిల్లా కలెక్టర్‌గా తనకు దక్కింది. కార్యాలయానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా వెళ్లి పరిశీలించి వాటిని పరిష్కరించేందుకు ముందుకు వెళ్తున్నా. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలి.
మహిళలు ధైర్యంతో ముందుకు సాగాలి..
- నితికా పంత్, కుమరం భీం జిల్లా ఎస్పీ
మహిళలు దైర్యంగా ముందుకు సాగి తమ లక్ష్యాలను సాధించాలి. సమాజ నిర్మాణం లో మహిళల పాత్ర ఎంతో గొప్పది. మహిళల రక్షణకు ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తుంది. మహిళలు భద్రంగా, గౌరవంగా జీవించేలా పోలీసుశాఖ ఎల్లపుడు కట్టుబడి పని చేస్తుంది. మహిళలపై వేధింపులు, నేరాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. మహిళల రక్షణ, భద్రత కోసం షీటీంలు భరోసా సెంటర్, పోలీసు యంత్రాంగం నిరంతరంగా పని చేస్తున్నాయి.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి..
- కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే
మారుతున్న కాలంతో పాటు మహిళలు అన్ని రంగాలలో రాణించాలి. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య, రాజకీయ తదితర రంగాలలో రాణించి ముందుకు సాగాలి. మహిళలు ఆర్థిక స్వాలంబన దిశగా పయనించాలి. ప్రజలకు సేవ చేసేందుకు ఆహర్నిశలు కృషి చేస్తాను. ఎంపీటీసీగా, సర్పంచ్‌గా, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా, రెండు పర్యాయలు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసే అవకాశం తనకు దక్కడం ఎంతో సంతోషంగా ఉంది.
115ఏఎస్‌ఎఫ్‌పి07: షాహీన్ సుల్తానా, మున్సిపల్ చైర్ పర్సన్, కాగజ్‌నగర్
మహిళా సాధికారతతోనే అభివృద్ధి..
- షాహీన్ సుల్తానా, కాగజ్‌నగర్ మున్సిపల్ చైర్‌పర్సన్
మహిళల సాధికారతతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది. పోటీ ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళలకు ప్రత్యేక చేయూతనిస్తోంది. ప్రభుత్వం ప్రోత్సాహ ం అందిపుచ్చుకొని అభివృద్ధికి బాటలు వేసుకోవాలి. వంటింటికి మహిళలు పరిమితం కాదని, అవసరమైన ఏ బాధ్యతనైనా సమర్థవంతంగా నిర్వర్తిస్తారని చాటాలి. గొప్ప గొప్ప మహిళలు నేపథ్యాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలి.
మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి..
- డాక్టర్ అనిత, కాగజ్‌నగర్ మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్‌గా గెలుపొందాను. కుటుంబం, సమాజం రెండింటికి దోహదపడే విధంగా పని చేయాలన్నదే ధ్యేయం. మహిళా హక్కుల సాధనకు మరింత కృషి జరగాల్సి ఉంది. మహిళలు సాధించనది ఏమీ లేదు. ఒక లక్ష్య సాధన దిశగా మహిళా లోకం ముందుకు వెళ్లాలి. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా కుటుంబంతో పాటు సమాజ అభివృద్ధికి పాటుపడాలి. తమ సమస్యలను పరిష్కరించుకోవడంలో ధైర్యంగా ముందుకు సాగాలి.