Share News

ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో మాయాజాలం

ABN , Publish Date - Aug 27 , 2026 | 12:56 AM

‘డిగ్రీ పూర్తయిందా? మా కళాశాలలో చేరండి.. తరగతులకు ప్రత్యేకంగా హాజరు కావాల్సిన అవసరం లేదు.. పరీక్షలు రాసుకోండి.. సర్టిఫికెట్‌ పొందండి.. ఉపాధ్యాయులను తీర్చిదిద్దాల్సిన బీఈడీ శిక్షణను కేవలం సర్టిఫికెట్‌ పొందే ప్రక్రియగా మార్చేశారనే విమర్శలు వస్తున్నాయి. బీఈడీ కోర్సులో విద్యా మనోవిజ్ఞానం, బోధనా పద్ధతులు,

ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో మాయాజాలం

పెద్దపల్లి, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ‘డిగ్రీ పూర్తయిందా? మా కళాశాలలో చేరండి.. తరగతులకు ప్రత్యేకంగా హాజరు కావాల్సిన అవసరం లేదు.. పరీక్షలు రాసుకోండి.. సర్టిఫికెట్‌ పొందండి.. ఉపాధ్యాయులను తీర్చిదిద్దాల్సిన బీఈడీ శిక్షణను కేవలం సర్టిఫికెట్‌ పొందే ప్రక్రియగా మార్చేశారనే విమర్శలు వస్తున్నాయి. బీఈడీ కోర్సులో విద్యా మనోవిజ్ఞానం, బోధనా పద్ధతులు, పాఠ్య ప్రణాళిక, ప్రాక్టికల్స్‌ కంప్యూటర్‌ పరిజ్ఞానం, పాఠశాలల్లో టీచింగ్‌ ప్రాక్టీస్‌ వంటి అంశాల్లో శిక్షణ అవసరం. ఇందుకోసం నిర్దేశిత హాజరు, తరగతులు, ప్రాక్టిక ల్స్‌ తప్పనిసరి. పెద్దపల్లి పట్టణంలోని ఒక బీఈడీ కళాశా లలో కన్వీనర్‌ కోటాలో ప్రవేశాలు, నిబంధనలకు మించి ఫీజుల వసూళ్లు, హాజరు అక్రమాలతో నడిపిస్తూ విద్యార్థు లను మోసం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే తరగతులకు హాజరు కాకుండానే బీఈడీ పూర్తి చేసుకొనే వెసలుబాటు కల్పిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

అడ్మిషన్‌ నుంచి డిసర్టేషన్‌ వరకు అదనపు వసూళ్లు

కౌన్సెలింగ్‌, రికార్డులు, యూనిఫాం, టీచింగ్‌ ప్రాక్టీస్‌, సహపాఠ్య కార్యక్రమాలు, డిసర్టేషన్‌ (పరిశోధనా గ్రంథం) తదితర పేర్లతో సాధారణ ఫీజులకు అదనంగా వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నాలుగో సెమిస్టర్‌ విద్యార్థుల నుంచి డిసర్టేషన్‌ పేరుతో ఒక్కొక్కరి వద్ద రూ.3 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. విద్యార్థులు స్వయంగా రూపొందించాల్సిన డిసర్టేషన్‌ రికార్డులను గతంలో తయారు చేసిన వాటిలో పేర్లు, కవర్లు మార్చి అందిస్తున్నారనే ఆరోప ణలు వినిపిస్తున్నాయి. కళాశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అర్హత కలిగిన అధ్యాపకులు, ప్రిన్సిపాల్‌, ఇతర సిబ్బంది ఉండాలి. అయితే అవసరమైన బోధనా సిబ్బంది అందుబాటులో లేరని సమాచారం. నిబంధనల ప్రకారం 17 మంది అధ్యాపకులు ఉండాలి. కానీ వాళ్లు రికార్డుల వరకే పరిమితం అని తెలుస్తున్నది. వారు విధులకు హాజరవు తున్నారా, వారి అర్హతలు, నియామక వివరాలు ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తే విషయం బయట పడుతుందని విద్యార్థి సంఘా ల నాయకులు అంటున్నారు.

ప్రైవేట్‌ ఉద్యోగాలు చేస్తూనే విద్యాభ్యాసం..

కళాశాలలో చదువుతున్న కొందరు విద్యార్థులు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తూనే రెగ్యులర్‌ బీఈడీ విద్యార్థులుగా కొనసాగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే సమ యంలో రీయింబర్స్‌మెంట్‌ ప్రయోజనాలు పొందుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇలాంటి విద్యార్థుల హాజరు, తరగతుల నిర్వహణ, కళాశాల రికార్డులు, రీయింబర్స్‌మెంట్‌ పత్రాలను అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉంది. కళాశాలకు అనుమతులు, గుర్తింపులు, యూనివర్సిటీ అనుబంధం ఉన్నా.. నిబంధనల ప్రకారం నిర్వహణ జరుగుతోందా, తరగ తులు, విద్యార్థుల హాజరు, టీచింగ్‌ ప్రాక్టీస్‌, అధ్యాపకుల హాజరు తదితర అంశాలపై అధికారులు విచారణ జరపాలని విద్యార్థి సంఘాల నాయకులు అధికారులను కోరుతున్నారు.

Updated Date - Aug 27 , 2026 | 12:56 AM