గూడెంగుట్టలో మాఘశుద్ధ పౌర్ణమి జాతర
ABN , Publish Date - Feb 01 , 2026 | 10:52 PM
: దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వా మి దేవాలయంలో శ్రీస్వామి వారిబ్రహ్మోత్సవాలు, మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుని ఆదివారం ఆలయంలో సత్యదే వుడికి పుష్పాలంకరణతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దండేపల్లి ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): దండేపల్లి మండలం గూడెం సత్యనారాయణ స్వా మి దేవాలయంలో శ్రీస్వామి వారిబ్రహ్మోత్సవాలు, మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుని ఆదివారం ఆలయంలో సత్యదే వుడికి పుష్పాలంకరణతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం సెలవు దినంకావడంతో ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ వ్యవస్థాపక కుటుంబసభ్యులు గోవర్ధన రఘస్వామి, సంపత్‌స్వామి ఆధ్వర్యంలో వేదపండితులు అభిరా మ్‌చార్యులు, అర్చకులు చాత్తాద శ్రీ వైష్టవ ఆచార సంప్రదాయం ప్రకారం స్వామి వారికి జయాది హోమం, శాంతి హోమం, మహా పూర్ణాహుతి, బలిహరణంతో పాటు స్వామి వారికి సేవ ఉత్సవ ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. వంద లాది మంది భక్తులు సామూహిక స్వామి వత్రాలను ఆచరించారు. భక్తులందరికీ స్వామి తీర్థప్రసాలను అందజేసి, ఆన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఈవో సంకటాల శ్రీనివాస్, సూపరిండెంట్ బుర్ర శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.