మాదిగలకు రాజ్యాధికారమే లక్ష్యం
ABN , Publish Date - Apr 06 , 2026 | 05:15 AM
మాదిగ సామాజిక వర్గాన్ని రాజ్యాధికారం దిశగా నడిపించడమే మాదిగ మహాశక్తి సంఘం ప్రధాన లక్ష్యమని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు స్పష్టం చేశారు.
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు
మాదిగ మహాశక్తి సంఘం జెండా ఆవిష్కరణ
బర్కత్‌పుర, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): మాదిగ సామాజిక వర్గాన్ని రాజ్యాధికారం దిశగా నడిపించడమే మాదిగ మహాశక్తి సంఘం ప్రధాన లక్ష్యమని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు స్పష్టం చేశారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మాదిగ మహాశక్తి సంఘం జెండా, లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని సుమారు 70 లక్షల మంది మాదిగలు తమ ఓటును తమ వర్గం కోసమే వినియోగించాలని పిలుపునిచ్చారు. మాదిగలలో ఐక్యత లేకపోవడం వల్లే రాజకీయంగా వెనుకబడుతున్నారని, లోక్‌సభ, రాజ్యసభ స్థానాల్లో సముచిత ప్రాధాన్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్టీ రామారావు మాత్రమే మాల, మాదిగలకు సమాన అవకాశాలు కల్పించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సంఘం ద్వారా మాదిగ సామాజిక వర్గాన్ని రాజకీయంగా ఏకం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు నర్సింహులు వెల్లడించారు.