Share News

రూ.50వేలు లంచం తీసుకుంటూ..ఏసీబీకి పట్టుబడిన ఎస్సై

ABN , Publish Date - Feb 11 , 2026 | 02:15 AM

ఒక కేసు విషయంలో సహకరించేందుకు బాధితుడి నుంచి రూ. లక్ష లంచం డిమాండ్‌ చేసి, రూ.50వేలు తీసుకుంటూ మాదాపూర్‌ ఎస్సై వినయ్‌ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

 రూ.50వేలు లంచం తీసుకుంటూ..ఏసీబీకి పట్టుబడిన ఎస్సై

  • ఓ కేసు విషయంలో సహకరించేందుకు రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్‌

  • వల పన్ని పట్టుకున్న అధికారులు..అదుపులోకి తీసుకుని విచారణ

హైటెక్‌సిటీ, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): ఒక కేసు విషయంలో సహకరించేందుకు బాధితుడి నుంచి రూ. లక్ష లంచం డిమాండ్‌ చేసి, రూ.50వేలు తీసుకుంటూ మాదాపూర్‌ ఎస్సై వినయ్‌ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అధికారులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆర్థిక నేరాలకు సంబంధించి నమోదైన ఒక కేసులో కోర్టు బాధితుడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీనికి సంబంధించి ప్రతివాదికి నోటీసులు ఇవ్వాలని బాధితుడు ఎన్నిసార్లు కోరినా ఎస్సై వినయ్‌ పట్టించుకోలేదు. నోటీసులు ఇవ్వాలంటే రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తొలుత రూ.50వేలు ఇచ్చి, నోటీసులు పంపాక మిగతా రూ.50 వేలు చెల్లించేలా ఒప్పందం కుదర్చుకున్నారు. అయితే బాధితుడు దీనిపై రంగారెడ్డి ఏసీబీ అధికారులను సంప్రదించారు. వారి సూచనలకు అనుగుణంగా బాధితుడు మంగళవారం ఎస్సై వినయ్‌కు రూ.50 వేలు అందించారు. వెంటనే ఏసీబీ డీఎస్పీ ఏపీ ఆనంద్‌కుమార్‌ తన సిబ్బందితో కలిసి ఎస్సై వినయ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయనను అదుపులోకి తీసుకుని, మాదాపూర్‌ పోలీసుస్టేషన్‌లో విచారించారు. 2018 ఎస్సై బ్యాచ్‌కు చెందిన వినయ్‌.. గతంలో కూకట్‌పల్లి సీసీఎ్‌సలో విధులు నిర్వహించారు. 10 నెలల క్రితమే మాదాపూర్‌ పోలీ్‌సస్టేషన్‌కు బదిలీ అయ్యారు. కాగా, రెండేళ్ల క్రితం ఇదే మాదాపూర్‌ పోలీ్‌సస్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై రంజిత్‌ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడటం గమనార్హం.

Updated Date - Feb 11 , 2026 | 02:15 AM