బెంగళూరు నుంచి విమానంలో ఊపిరితిత్తులు
ABN , Publish Date - Apr 07 , 2026 | 05:23 AM
ఓ వ్యక్తికి అత్యవసరంగా ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స అందించేందుకు వైద్య బృందం బెంగళూరులో సేకరించిన ఊపిరితిత్తులను సికింద్రాబాద్‌కు తరలించింది.
శంషాబాద్ నుంచి సికింద్రాబాద్ కిమ్స్‌కు గ్రీన్ చానెల్ ఏర్పాటు
39 కిలోమీటర్లు... 31 నిమిషాల్లో తరలింపు
రాంగోపాల్‌పేట్, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): ఓ వ్యక్తికి అత్యవసరంగా ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స అందించేందుకు వైద్య బృందం బెంగళూరులో సేకరించిన ఊపిరితిత్తులను సికింద్రాబాద్‌కు తరలించింది. బెంగళూరు నుంచి ఊపిరితిత్తులను ప్రత్యేక విమానంలో ఎయిర్ లిఫ్ట్ చేసి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులోని కిమ్స్ ఆస్పత్రికి ఈ అవయవాలను వేగంగా చేరవేసేందుకు హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రత్యేకంగా గ్రీన్ చానెల్ ఏర్పాటు చేశారు. అంబులెన్సు ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను నియంత్రించడంతో.. కేవలం 31 నిమిషాల్లోనే 39 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి ఊపిరితిత్తులను తరలించారు. ఊపిరితిత్తులను కాపాడాల్సిన సమయం తక్కువగా ఉండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా పోలీసులు కృషి చేశారు.