kumaram bheem asifabad- లోలెవల్ వంతెనలు.. తీరని కష్టాలు
ABN , Publish Date - Jun 27 , 2026 | 11:05 PM
వానాకాలంలో లోలెవల్ వంతెనల పైనుంచి వరదననీరు ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రజలు కష్టాలు పడుతున్నారు. జిల్లాలో పలు వాగులపై ఉన్న లోలెవల్ వంతెనలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురిసినప్పుడు వాగులు ఉప్పోంగి లోలెవల్ వంతెనలసైకి వరద నీరు చేరుతోంది.దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. జిల్లాలో పలువాగులపై ఉన్న లో లెవల్ వంతెనలతో గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు. వ
- హైలెవల్ వంతెనలు నిర్మించాలని వినతి
ఆసిఫాబాద్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): వానాకాలంలో లోలెవల్ వంతెనల పైనుంచి వరదననీరు ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రజలు కష్టాలు పడుతున్నారు. జిల్లాలో పలు వాగులపై ఉన్న లోలెవల్ వంతెనలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురిసినప్పుడు వాగులు ఉప్పోంగి లోలెవల్ వంతెనలసైకి వరద నీరు చేరుతోంది.దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. జిల్లాలో పలువాగులపై ఉన్న లో లెవల్ వంతెనలతో గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు. వర్షాలు కురిసినపుడు వాగులు ఉప్పోంగి కల్వర్టులపై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. కల్వర్టులు నీటిలో మునుగుతుండగా వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఆసిపాబాద్ మండలంలోని తుంపెల్లి వాగుపై ఉన్న లో లెవల్ వంతెన పైనుంచి వర్షాకాలంలో వరద నీరు భారీగా ప్రవహిస్తు ఉంటుంది, దీంతో ఆసిపాబాద్, తిర్యాణి మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లలేక ఇబ్బందులు ఎదురొంటున్నారు.
- రాజురా గ్రామ సమీపంలో..
రాజురా గ్రామ సమీపంలో ఒర్రెపై ఉన్న మరో లోలెవల్ వంతెన పైనుంచి కూడా వరద నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. బెజ్జూర్ మండలంలో సుశ్మీర్ . కిష్ణపల్లి ఒర్రెలపై లోలెవల్ వంతెనలతో ఏటా ఇబ్బందులు పడుతున్నారు. వాంకిడి మండలంలో కన్నర్‌గాం, కెరమెరి మండలంలో సాంగ్వీ-కెలి-బి,మెట్టపిప్పిరి,కర్పతగూడ, లెండిగూడ-గౌరి గ్రామాల వద్ద ఉన్న లోలెవల్ వంతెనలతో ఇబ్బందులు తప్పడం లేదు. అత్యవ సర పరిస్థితుల్లో వరదనీరు ప్రవా హంలో కల్వర్టు దాటడానికి ప్రయత్నించి ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రస్తుతం వానాకాలం సమీపిస్తుండడంతో ఈ ప్రాంత ప్రజలు మళ్లీ భయం భయంగా బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గతేడాది పడ్డ కష్టాలు మళ్లీ పడాల్సి వస్తుందే మోనని భయందోళనకు గురౌతున్నారు.. ఈసారి ఏ విధంగా ఉంటుందోనని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా ఈ సమస్యను పరిష్కరిం చాలని ప్రజలు విన్నవిస్తు న్నా ఫలితం లేకుండా పోతోంది. ఉన్నతాధికారులు, ప్రజాప్రతి నిధులు స్పందించి లోలెవల్ వంతెనల స్థానంలో హైలెవల్ వంతెనలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.