kumaram bheem asifabad-తీరనున్న లో ఓల్టేజీ సమస్య
ABN , Publish Date - Feb 23 , 2026 | 10:43 PM
గూడెం పరిసర గ్రామాల్లో ఉన్న 23 గ్రామాలకు ఇక లో ఓల్టేజీ సమస్య దూరం కానుందని సిర్పూర్ నిజయోజకవర్గ ఎమ్మెల్యే డాకర్టర్ పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. మండలంలోని గూడెం గ్రామంలో 33/11 కేవీ సబ్ స్టేషన్‌కు సోమవారం భూమి పూజ చేశారు.
చింతలమానేపల్లి, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): గూడెం పరిసర గ్రామాల్లో ఉన్న 23 గ్రామాలకు ఇక లో ఓల్టేజీ సమస్య దూరం కానుందని సిర్పూర్ నిజయోజకవర్గ ఎమ్మెల్యే డాకర్టర్ పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. మండలంలోని గూడెం గ్రామంలో 33/11 కేవీ సబ్ స్టేషన్‌కు సోమవారం భూమి పూజ చేశారు. గత నెలలో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇక్కడ భూమి కేటాయింపు సమస్యను పరిష్కరించామన్నారు. గ్రామాల్లో అదనంగా కరెంటు స్తంభాలు, లైన్లు, కావాలంటే విద్యుత్ ఏఈలను సంప్రదించి దరఖాస్తు పెట్టుకోవాలన్నారు. గూడెం-బాబాసాగర్ రోడ్డు హ్యామ్ కింద మంజూరైందని, త్వరలోనే పనులు మొదలు పెడతామని తెలిపారు. చాలా కాలం తరువాత బెజ్జూరు నుంచి అహిరి వరకు వయా గూడెం బస్సులు నడుస్తున్నాయని చెప్పారు. దీని ద్వారా బెజ్జూరు, చింతలమానేపల్లి మండలాల ప్రజలకు సౌకర్యం ఏర్పడిందని తెలిపారు. దశల వారీగా గ్రామస్తుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్, డీఈ వీరేష్, ఏడీఈ ఇర్ఫాన్, ఏఈ అంజల్‌కుమార్, కాంట్రాక్టర్ సత్తయ్య, సర్పంచ్ సునీత అశోక్‌రెడ్డి, ఉప సర్పంచ్ ప్రవీణ్, నాయకులు మల్లయ్య, వెంకయ్య, నానయ్య, నానయ్య, రంగయ్య, తుకారాం, పవన్, రావు, భద్రేశ్వర్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.
పనులను వేగవంతం చేయాలి..
దిందా- కేతిని గ్రామాల మధ్య ఉన్న వాగుపై హైలెవల్ వంతెన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే హరీష్ బాబు అన్నారు. వంతెన నిర్మాణ పనులను సోమవా రం ఆయన పరిశీలించారు. కాంట్రాక్టర్‌ను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ వంతెన పూర్తయితే దిందా వాసులకు చిరకాల కోరిక నెరవేరుతుందని అన్నారు. వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా ప్రయాణాలు చేయవచ్చని తెలిపారు. దిందా గ్రామంలో సాగు చేసుకుంటున్న పోడు రైతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అటవీ అధికారులు పోడు భూములను స్వాధీన పర్చుకొని తమకు ఇబ్బందులను గురిచేస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి పలువురు తీసుకువచ్చారు. ఒక్కో రేషనర్ కార్డుకు నాలుగు ఎకరాల చొప్పున ఇచ్చేలా కలెక్టర్, అలాగే అధికార యంత్రాంగం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తానని రైతులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.