Share News

kumaram bheem asifabad- వేడుకలకు గణనాథులు సిద్ధం

ABN , Publish Date - Sep 12 , 2026 | 11:36 PM

జిల్లాలో నవరాత్రులు సందడి మొదలైంది. మార్కెట్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలతో పాటు పర్యావరణ హిత మట్టితో తయారు చేసిన విగ్రహాలు ఈ సారి అమ్మకానికి సిద్ధం చేశారు. బెంగాళీ కళాకారులు జీవం ఉట్టిపడేట్టు మట్టితో విగ్రహాలు తయారు చేశారు. బెంగాళీ క్యాంపు నుంచి కళాకారులు 3 ఫీట్ల నుంచి 21 ఫీట్ల వరకు భారీ మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నారు.

kumaram bheem asifabad- వేడుకలకు గణనాథులు సిద్ధం
: కాగజ్‌నగర్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న వినాయక విగ్రహాలు

కాగజ్‌నగర్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నవరాత్రులు సందడి మొదలైంది. మార్కెట్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలతో పాటు పర్యావరణ హిత మట్టితో తయారు చేసిన విగ్రహాలు ఈ సారి అమ్మకానికి సిద్ధం చేశారు. బెంగాళీ కళాకారులు జీవం ఉట్టిపడేట్టు మట్టితో విగ్రహాలు తయారు చేశారు. బెంగాళీ క్యాంపు నుంచి కళాకారులు 3 ఫీట్ల నుంచి 21 ఫీట్ల వరకు భారీ మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నారు. అలాగే సహజసిద్దమైన వాటర్‌ కలర్లను వినియోగిస్తున్నారు. గత నాలుగు నెలలు వివిధ ఆర్డర్లను బుక్‌ చేసుకున్నారు. ఒక్కొక్క విగ్రహానికి రూ.3 వేల నుంచి రూ.50వేల వరకు విగ్రహా ఽధర పలుకుతున్నాయి. కాగజ్‌నగర్‌లోని ప్రధాన కూడళల్లో ప్రతిష్టించే విగ్రహాలు జగిత్యాల, హైదరాబాద్‌, కరీంనగర్‌, చంద్రాపూర్‌, బల్లార్షా ప్రాంతాల నుంచి ప్రత్యేక లారీల్లో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత రెండ్రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో మండపంలో నీరు కురియటంతో పై భాగంలో టార్పాలిన్‌, ప్లాస్టిక్‌ కవర్లతో కట్టుదిట్టంగా కడుతున్నారు. భారీ విగ్రహాల రాక సందర్భంగా విద్యుత్‌ శాఖ అధికారులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుం డా పట్టణ సీఐ ప్రేంకుమార్‌ ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Updated Date - Sep 12 , 2026 | 11:36 PM