Share News

kumaram bheem asifabad-కొలువుదీరిన గణనాథులు

ABN , Publish Date - Sep 15 , 2026 | 11:15 PM

జిల్లాలోని ఆయా మండలాల్లో సోమవారం వినాయక చవితి సందర్భంగా గణనాథులను ప్రతిష్ఠించారు. ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంతో పాటు మండలంలో వినాయకచవితి వేడుకలను సోమవారం భక్తులు ఘనంగా జరుపుకున్నారు. లయన్స్‌క్లబ్‌, పద్మశాలీ, మున్నూరుకాపు సంఘాల ఆధ్వర్యంలో భక్తులకు మట్టి వినాయకుల ప్రతిమలను పంపిణీ చేశారు.

kumaram bheem asifabad-కొలువుదీరిన గణనాథులు
ఆసిఫాబాద్‌లో పూజలు చేస్తున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ఆసిఫాబాద్‌/కాగజ్‌నగర్‌/సిర్పూరు(టి))/కౌటాల/పెంచికల్‌పేట్‌/రెబ్బెన/చింతలమానేపల్లి/కెరమెరి/దహెగాం/తిర్యాణి/వాంకిడి/బెజ్జూరు/సిర్పూర్‌(యు) సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఆయా మండలాల్లో సోమవారం వినాయక చవితి సందర్భంగా గణనాథులను ప్రతిష్ఠించారు. ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంతో పాటు మండలంలో వినాయకచవితి వేడుకలను సోమవారం భక్తులు ఘనంగా జరుపుకున్నారు. లయన్స్‌క్లబ్‌, పద్మశాలీ, మున్నూరుకాపు సంఘాల ఆధ్వర్యంలో భక్తులకు మట్టి వినాయకుల ప్రతిమలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కోవలక్ష్మి నివాసంలో గణనాథున్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. పోలీసు ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో వినాయక చవితి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వినాయక ప్రతిమను ప్రితిష్టించి ఎస్పీ నితికా పంత్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా పార్టీల, సంఘాల నాయకులు పాల్గొన్నారు. కాగజ్‌నగర్‌ పట్టణంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని వివిధ వార్డుల్లో గణనాఽథుడి విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు మండపాలకు చేరుకని స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వినాయక మండపాలను నిర్వహకులు విద్యుత్‌ దీపాలతో, వివిధ రకాల అలంకరణలతో సుందరంగా తీర్చిదిద్దారు. పలు చోట్ల భక్తులకు ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగజ్‌నగర్‌లో ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌, సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌ ఉచిత మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. అలాగే వినాయక మండలి వద్ద పూజల్లో పాల్గొన్నారు. సిర్పూరు(టి)లో పలు కాలనీల్లో పలు మండపాల వద్ద గణనాథులను ప్రతిష్టించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమంలో కౌటాల సీఐ సంతోష్‌ కుమార్‌ పాల్గొని భక్తులకు భోజనం వడ్డించారు. స్థానిక ట్రైబల్‌ వెల్ఫేర్‌ బాలికల పాఠశాల సమీపంలో చిన్నారులు ఏర్పాటు చేసిన గణేశ్‌ మండపం ఆకట్టుకుంటుంది. చిన్నారులే స్వయంగా చందాలు వేసుకొని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కౌటాలలో కూడా ఘనంగా ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు కొలాటాలు ఆడారు. పెంచికల్‌పేట మండలంలో గణనాఽథుడిని ప్రతిష్ఠించారు. స్థానిక పోలీస్‌స్షేషన్‌లో ప్రతిష్టించిన గణనాథుడి వద్ద ఎస్సై అనిల్‌ కుమార్‌ పూజలు చేశారు. రెబ్బెనలో నంబాల, నారాయణపూర్‌, కృష్ణాపూర్‌, గంగాపూర్‌ ఆయా గ్రామాల్లోని పలు కాలనీల్లో మండపాల్లో గణనాథుడిని ప్రతిష్థించారు. ఈ సందర్భంగా వేద పండితులు పూజలు నిర్వహించారు. అలాగే చింతలమానేపల్లిలో గ్రామ గ్రామాన గణనాథుడిని భక్తిశ్రద్ధలతో ప్రతిష్టించి వేద పండితుల సమక్షంలో పూజలు చేశారు. గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. కెరమెరి మండల వ్యాప్తంగా ఆయా మండపాల్లో వినాయకులను ప్రతిష్ఠించారు. తిర్యాణిలో అంగరంగం వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. వాంకిడిలో భక్తులు వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. బెజ్జూరు మండల వ్యాప్తంగా సోమవారం వినాయక చవితి సందర్బంగా వాడవాడలా గణనాథులు కొలువుతీరారు. పద్మశాలి సంఘం అధ్యక్షుడు సామల తిరుపతి ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. సిర్పూర్‌(యు) మండల వ్యాప్తంగా సోమవారం వినాయక చవితి సందర్బంగా వాడవాడలా గణనాథులను ప్రతిష్ఠించి పూజలు చేశారు.

Updated Date - Sep 15 , 2026 | 11:15 PM