Share News

లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Sep 05 , 2026 | 11:31 PM

ఈనెల 12వ తేదీన నిర్వ హించనున్న జాతీయ లోక్‌అదాలత్‌ను కక్షి దారులు సద్వినియోగం చేసుకోవాలని ప్రి న్సిపల్‌ డిస్ర్టిక్ట్‌, సెషన్స్‌ న్యాయాధికారి డి.ర మాకాంత్‌ అన్నారు.

లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
లోక్‌అదాలత్‌ పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ప్రిన్సిపల్‌ డిస్ర్టిక్ట్‌, సెషన్స్‌ న్యాయాధికారి డి.రమాకాంత్‌

- ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌, సెషన్స్‌ న్యాయాధికారి డి.రమాకాంత్‌

నాగర్‌కర్నూల్‌ క్రైం, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : ఈనెల 12వ తేదీన నిర్వ హించనున్న జాతీయ లోక్‌అదాలత్‌ను కక్షి దారులు సద్వినియోగం చేసుకోవాలని ప్రి న్సిపల్‌ డిస్ర్టిక్ట్‌, సెషన్స్‌ న్యాయాధికారి డి.ర మాకాంత్‌ అన్నారు. జిల్లా కోర్టులో న్యాయ సే వాధికార సంస్థ ఆధ్వర్యంలో విలేకర్ల స మావేశాన్ని శనివారం నిర్వహించారు. వివిధ రకాల కేసుల్లో పెండింగ్‌లో ఉన్న వాటిని ప రిష్కరించుకునేందుకు ఇది మంచి అవకాశమ ని ఆయన పేర్కొన్నారు. లోక్‌అదాలత్‌ పరిష్కా రం చేసుకుంటూ ఇరువురికీ న్యాయం లభించి నట్టేనని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక సెషన్స్‌ న్యాయాధికారి నసీం సుల్తానా మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌లో క్రిమినల్‌, సివిల్‌, కుటుం బ కేసులు రాజీపడవచ్చని అన్నారు. ప్రత్యేక సె షన్స్‌ న్యాయాధికారి నసీంసుల్తానా, జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ నిహారిక, సీనియర్‌ సివిల్‌ న్యాయా ధికారి గోపిక నాగ శ్రావ్య, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి శృతి ధూత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2026 | 11:31 PM