28న జిల్లా కోర్టులో లోక్ అదాలత్
ABN , Publish Date - Mar 25 , 2026 | 11:26 PM
ఈ నెల 28న జిల్లా కోర్టు ఆవరణలో ని ర్వహించే లోక్ అదాలత్‌ను సద్వినియోగం చే సుకోవాలని డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ న్యాయాధికా రి డి.రమాకాంత్ అన్నారు.
నాగర్‌కర్నూల్ టౌన్, మార్చి 25 (ఆంధ్రజ్యో తి): ఈ నెల 28న జిల్లా కోర్టు ఆవరణలో ని ర్వహించే లోక్ అదాలత్‌ను సద్వినియోగం చే సుకోవాలని డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ న్యాయాధికా రి డి.రమాకాంత్ అన్నారు. బుధవారం జిల్లా లోని భూతగాద కేసులు, రాజీ చేసుకోదగిన క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, కుటుం బ కేసులు, మోటారు వాహనాల ఆక్సిడెంట్ కే సులు, బ్యాంకు కేసులు తదితర పెండింగ్ కేసు లను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. రాజీ మార్గమే ప్రధానమార్గమని, కక్షిదారులు సగ లు ప్రతీకారాలు పెంచుకోవద్ద న్నారు. ఇరు వ ర్గాలు రాజీ చేసుకోవడం వల్ల మానవ సంబం ధాలు బలపడతాయన్నారు. జిల్లాలోని న్యాయ సహాయం అవసరమైన వారు లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్ర మంలో జిల్లా పోక్సో స్పెషల్ కోర్డు న్యాయాధికా రి నసీం సుల్తానా తదితరులు పాల్గొన్నారు.