kumaram bheem asifabad- బడికి తాళం
ABN , Publish Date - Nov 03 , 2026 | 10:37 PM
అదో సరస్వతి నిలయం...అక్కడ విద్యార్థులకు చదువుతో పాటు విద్యా బుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు విధులకు డుమ్మా కొట్టారు. దీంతో ఆ విద్యార్థులంతా పక్కన ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో చేరారు. తరచూ ఉపాధ్యాయులు విధులకు హాజరు కాకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. మండలంలోని కుంటలమానేపల్లి ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల తీరు ఇది...మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ పాఠశాలను సందర్శించగా బడికి తాళం వేసి ఉంది. దీంతో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి
బెజ్జూరు, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): అదో సరస్వతి నిలయం...అక్కడ విద్యార్థులకు చదువుతో పాటు విద్యా బుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు విధులకు డుమ్మా కొట్టారు. దీంతో ఆ విద్యార్థులంతా పక్కన ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో చేరారు. తరచూ ఉపాధ్యాయులు విధులకు హాజరు కాకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. మండలంలోని కుంటలమానేపల్లి ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల తీరు ఇది...మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ పాఠశాలను సందర్శించగా బడికి తాళం వేసి ఉంది. దీంతో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పాఠ శాలలో ఐదు తరగతులు కొనసాగుతుండగా, 28మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇక్కడ ఇద్దరు ఉపాధ్యాయులుండగా, హెచ్‌ఎంగా విధులు నిర్వహిస్తున్న నందరాం ఎస్సీఈఆర్పీగా అధనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా ఆ ఉపాధ్యాయుడు పాఠశాల తనిఖీలో భాగంగా మొగవెల్లికి వెళ్లినట్లు పేర్కొన్నారు. మరో ఉపాధ్యాయుడు సంతోష్ ఎలాంటి సమాచారం లేకుండా విధులకు డుమ్మా కొట్టడంతో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు అంగన్‌వాడీ కేంద్రంలో చదువుతున్నారు.
విధులకు హాజరు కాకపోవడంతో..
కుంటలమానేపల్లి గిరిజన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు తరచూ పాఠశాల విధులకు ఎగనామం పెడుతుండడంతో గిరిజన విద్యార్థులు చదువుకు దూరమవ ుతున్నారు. పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయులు హాజరు కాని ఎడల అదే పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు విధులకు రావాల్సి ఉంది. ఇతర పాఠశాలకు తనిఖీ పేరిట వెళ్లకుండా ఉండాలి. లేదా ఇతర ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలి, కానీ అవేమి పట్టించుకోకుండా ఇద్దరు ఉపాధ్యాయులు విధులకు డుమ్మా కొట్టారు. ఎస్సీఈఆర్పీగా విధులు చేపడుతున్నా అదే పాఠశాలలో విధులు నిర్వహించాలని ఉన్నతాధికారులు స్పష్టంగా చెబుతున్నా తాను తనిఖీకి వెళ్లానని చెప్పారు. ఇక సంతోష్ అనే ఉపాధ్యాయుడు తరచూ పాఠశాలకు హాజరు కావడం లేదని, మంగళవారం రోజు కూడా సంబంధిత స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే డుమ్మా కొట్టారు. ఈ విషయంపై స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం భిక్షమయ్యను సంప్రదించగా సంతోష్ అనే ఉపాధ్యాయుడు సమాచారం ఇవ్వలేదని తెలిపారు. కాగా గిరిజన సంక్షేమ శాఖ డీడీ అంబాజీని సంప్ర దించగా విధులకు గైర్హాజరవుతున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామన్నారు.