సర్కారు బడికి స్థానిక ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల పిల్లలు
ABN , Publish Date - Jun 20 , 2026 | 04:54 AM
మహబూబాబాద్ జిల్లా జంగిలికొండ, ఫత్తేపురం గ్రామాలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు తమ పిల్లలను సర్కారు బడుల్లో ..
మహబూబాబాద్ ఎడ్యుకేషన్/ తొర్రూరు రూరల్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): మహబూబాబాద్ జిల్లా జంగిలికొండ, ఫత్తేపురం గ్రామాలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు తమ పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు మెరుగుపడుతుండటంతో.. ఇక్కడ చేర్పించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. ఫత్తేపురం గ్రామ సర్పంచ్ ఇట్టే మాధవరెడ్డి శుక్రవారం తన కూతురును మాటేడు ఉన్నత పాఠశాలకు చేర్పించారు. అలాగే జంగిలిగొండ గ్రామ ఉపసర్పంచ్ కోయల అనిల్, ఐకేపీ వీవో గోల్కొండ స్రవంతి, సాప్ట్‌వేర్ ఉద్యోగి మట్టికాసం వీరేష్, ప్రైవేటు ఉద్యోగులు వేముల మధు, మురళి, పోతుగంటి విజయ్‌లు తమ పిల్లలను స్థానిక ప్రభుత్వ ప్రాఽథమిక పాఠశాలకు పంపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో.. కార్పొరేట్‌కు దీటుగా నాణ్యమైన విద్య అందుతోందని, అందుకే ప్రైవేట్ చదువులను వీడి సర్కారు బడుల వైపు అడుగులు వేశామని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.