బాధిత కుటుంబానికి ఎల్‌వోసీ అందజేత
ABN , Publish Date - Jun 13 , 2026 | 11:02 PM
మం డలంలోని అగ్రహారంతండాకు చెందిన నేనావ త్ శాంతి కొన్ని రోజుల క్రితం ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
చారకొండ, జూన్ 13 (ఆంధ్రజ్యోతి) : మం డలంలోని అగ్రహారంతండాకు చెందిన నేనావ త్ శాంతి కొన్ని రోజుల క్రితం ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. చికిత్స నిమి త్తం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోవ డంతో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సహకారంతో మంజూరైన రూ. 5లక్ష ల ఎల్‌వోసీనీ శనివారం అచ్చంపేటలో ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ స భ్యులకు అందజేశారు. పేదల వ్యైద్యం కోసం ప్ర భుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ చి క్కుడు వంశీకృష్ణ అన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండె వెంకట్‌గౌడ్, డీసీసీ ప్రధా న కార్యదర్శి జమ్మికింది బా ల్‌రాంగౌడ్, కాంగ్రెస్ మండ ల ప్రధాన కార్యదర్శి జేసీబీ వెంకటయ్యగౌడ్, అగ్రహా రంతండా మాజీ సర్పంచ్ ప్రశాంత్‌నాయక్, ఎన్‌ఎస్ యూఐ మండల అధ్యక్షు డు గోరటి శివ, మాజీ ఎం పీటీసీ నర్సింహారెడ్డి, మా జీ ఉపసర్పంచ్ రూప్‌సిం గ్ తదితరులు పాల్గొన్నారు.