రైతన్నల తరహాలో నేతన్నలకు రుణమాఫీ
ABN , Publish Date - Sep 21 , 2026 | 01:07 AM
సిరిసిల్ల చేనేత,పవర్‌లూమ్ రంగానికి, నేతన్నలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని, వస్త్ర పరిశ్ర మ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటూ, చేతినిండా పని కల్పించాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం సిరిసిల్ల వస్త్ర వ్యాపార సంఘ భవనంలో
సిరిసిల్ల, సెప్టెంబరు 20(ఆంరఽధజ్యోతి): సిరిసిల్ల చేనేత,పవర్‌లూమ్ రంగానికి, నేతన్నలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని, వస్త్ర పరిశ్ర మ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటూ, చేతినిండా పని కల్పించాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం సిరిసిల్ల వస్త్ర వ్యాపార సంఘ భవనంలో ఘనంగా సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. నూతన అధ్యక్షుడిగా తాటిపాముల దామోదర్, ఉపాధ్యక్షుడిగా గౌడరాజు, కార్యదర్శిగా శ్రీ గాధ విష్ణు, సహాయ కార్యదర్శిగా బొడ్డు శ్రీధర్, కోశాధికారిగా సామల శ్రీనివాస్‌లతోపాటు డైరెక్టర్లుగా సిరిపురం కృష్ణ, గాజుల మల్లేశం, గుండేటి మధుకర్, మెర్గు సత్యనారాయణ, అన్నల్‌దాస్ సురేష్, దూస కృష్ణ ప్రసాద్, జిందం రవి, కళ్యాడపు పాండురంగం, రిక్కమల్లె బాల శివరామకృష్ణ, కోడం శ్రీనివాస్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. వారికి నియామక పత్రాలను ఆది శ్రీనివాస్ అందించారు. సిరిసిల్ల పద్మశాలి సంఘం, వస్త్ర వ్యాపార సంఘాల ప్రతి నిధులు నూతన కార్యవర్గాన్ని సన్మానించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన పలువురికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించిందని గుర్తు చేశారు. రైతు రుణమాఫీ తరహాలోనే నేతన్నల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించిం దని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృ త్వంలోని ప్రభుత్వం సుమారు రూ 49 కోట్ల మేర నేతన్నల రుణాలను మాఫీ చేసిందని పేర్కొన్నారు. నేతన్నల విద్యుత్ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు. విద్యుత్ సంస్థ ఎన్‌పీడీసీఎల్ పరిధిలోకి వచ్చిన 48 గంటల్లోనే నేతన్నలు కోరిన పవర్‌లూమ్ పరిశ్రమకు విద్యుత్ సబ్సిడీ 25 హెచ్‌పీల వరకు పెంచడంతో మార్పు జరిగిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తర్వాత సిరిసిల్ల కలెక్టర్ చౌరస్తా వద్ద నేతన్నల జీవన విధానాన్ని ప్రతిబింబించేలా ’జోట నాడే‘ స్టాచ్యూ ఏర్పాటు చేశామని అన్నారు. మాజీ ప్రభుత్వ విప్ వీరబత్తిని అనిల్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సిరిసిల్ల నేత కార్మికుల సమ స్యలను పట్టించుకోలేదని అన్నారు. గత ప్రభుత్వ వస్త్ర పరిశ్ర మకు పెట్టిన బకాయిలను చెల్లించడం జరిగిందన్నారు. తెలంగాణ పద్మశాలి కార్పొరేషన్ అధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ పద్మశా లీలు రాజకీయ రంగంలో ముందుకు వెళ్లాలని అన్నా రు. కార్యక్రమంలో తెలంగాణ హైండ్లూమ్స్ కార్పొ రేషన్ చైర్మన్ దూడం వెంకటరమణ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, తెలంగాణ హైండ్లూ మ్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ జక్కని అనిత, మున్సిప ల్ చైర్ పర్సన్ జిందం కళాచక్రపాణి, జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేల్ముల స్వరూపారెడ్డి అన్నల్‌దాస్ అనిల్, ఆడెపు భాస్కర్, గూడూరి ప్రవీ ణ్, దూడం శంకర్, గాజుల బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.