రుణ లక్ష్యాలను పూర్తి చేయాలి
ABN , Publish Date - Aug 27 , 2026 | 11:43 PM
జిల్లాలో బ్యాంకులకు నిర్దేశించిన వివిధ రకా ల రుణ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ బ్యాంకర్లను ఆదేశించారు.
- బ్యాంకర్ల సమావేశంలో ఎంపీ మల్లు రవి, కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
నాగర్‌కర్నూల్, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో బ్యాంకులకు నిర్దేశించిన వివిధ రకా ల రుణ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ బ్యాంకర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నాగర్‌క ర్నూల్ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మల్లు రవితో కలిసి కలెక్టర్ బ్యాంకర్లతో సమీక్షా సమా వేశం నిర్వహించారు. క్రాప్‌లోన్స్, వ్యవసాయ ఆధారిత రుణాలు, ముద్ర, ఎంఎస్‌ఎంఈ రు ణాలపై సమీక్షించారు.
నానో ఎరువులపై అవగాహన కల్పించాలి
నానో యూరియా, నానో డీఏపీ వంటి ఆధు నిక ఎరువుల వినియోగం, ప్రయోజనాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని కలె క్టర్ హేమంత కేశవ్ పాటిల్ వ్యవసాయ శాఖ అధి కారులను ఆదేశించారు. గురువారం కలెక్ట రేట్‌లో కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సహకారంతో నిర్వహించిన నానోఎరువులు, ఎఫ్ ఎఫ్‌ఎస్ యూప్‌పై శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. అధికారులు కార్యాల యాలకే పరమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప ర్యటించి రైతుల సమస్యలను గుర్తించి పరిష్క రించ లని సూచించారు.
రాఖీ పండుగ శుభాకాంక్షలు
రాఖీ పండుగ సందర్భంగా నాగర్‌కర్నూల్ పట్టణంలోని సనస్వతి శిశుమందిర్ విద్యార్థిను లు గురువారం కలెక్టర్ హేమంత కేశవ్ పాటి ల్‌ను మర్యాదపూర్వకంగా కలిసి రాఖీ కట్టి శు భాకాంక్షలు తెలిపారు. క్రమశిక్షణతో ముందు కు సాగి తల్లిదండ్రులు, పాఠశాల, జిల్లాకు మం చి పేరు తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆత్మీ యత, పరస్పర గౌరవానికి రాఖీ ప్రతీక అన్నా రు. జిల్లా ప్రజలకు రాఖీ పండుగ శుభాకాం క్షలు తెలిపారు.
వైద్య సేవల్లో నిర్లక్ష్యాన్ని సహించం
పెద్దకొత్తపల్లి, (ఆంధ్రజ్యోతి) : మారుమూల గ్రామాల్లోని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలం దేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచించారు. గురువారం మండల పరిధిలోని వెన్నచెర్ల, నక్క లపల్లి గ్రామాల్లో కలెక్టర్ విస్తృతంగా పర్యటిం చారు. వెన్నచెర్ల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి వైద్య సేవలను పరిశీలిం చారు. అనంతరం నక లపల్లి గ్రామ పరిధిలో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ గ్రామసభలో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం గ్రామానికి చెందిన రైతు బోలే ఈశ్వరయ్య పొలంలో వీబీజీ రాంజీ పథకం కింద నిర్మించనున్న ఫాంపాండ్ నిర్మాణ పనులను కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ వెం ట ఆర్డీవో బన్సీలాల్, తహసీల్దార్ ఎం.శ్రీనివాసు లు, సర్పంచ్ మొట్ట కుర్మయ్య పాల్గొన్నారు.
ఫ నక్కలపల్లి గ్రామ సమస్యలపై స్థానికులు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.