Share News

ఎల్‌ఎల్‌ఆర్‌.. అందుబాటులో స్లాట్‌..!

ABN , Publish Date - Feb 20 , 2026 | 01:34 AM

లెర్నర్‌ లైసెన్స్‌ రిజిస్ర్టేషన్‌(ఎల్‌ఎల్‌ఆర్‌) స్లాట్లు అందుబాటులోకి వచ్చాయి. ‘ఎల్‌ఎల్‌ఆర్‌.. నో స్లాట్‌’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై రవాణా శాఖ స్పందించి దిద్దుబాటు...

ఎల్‌ఎల్‌ఆర్‌.. అందుబాటులో స్లాట్‌..!

  • దిద్దుబాటు చర్యలు చేపట్టిన రవాణా శాఖ

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): లెర్నర్‌ లైసెన్స్‌ రిజిస్ర్టేషన్‌(ఎల్‌ఎల్‌ఆర్‌) స్లాట్లు అందుబాటులోకి వచ్చాయి. ‘ఎల్‌ఎల్‌ఆర్‌.. నో స్లాట్‌’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై రవాణా శాఖ స్పందించి దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. ఎల్‌ఎల్‌ఆర్‌ స్లాట్లు సరిపడా అందుబాటులో ఉండేలా సాంకేతిక మార్పులు చేసినట్టు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలో 56 రవాణా శాఖ కార్యాలయాలు ఉండగా.. నాలుగైదు చోట్ల స్లాట్ల బుకింగ్‌ సమస్య తలెత్తింది. 15రోజుల తరువాత స్లాట్ల బుక్‌ చేసుకోవాలని చూపుతోన్న కార్యాలయాల అధికారులతో సమీక్షించి ఎక్కువ స్లాట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. రెండు రోజులకు మించి ఎదురు చూడకుండా స్లాట్ల బుకింగ్‌ జరిగేలా మార్పులు చేశారు. అదనపు కంప్యూటర్లు ఏర్పాటు చేస్తామని, సిబ్బంది ఎక్కువ సమయం పనిచేసేలా చూడాలని ఆదేశాలిచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు.

Updated Date - Feb 20 , 2026 | 01:34 AM