Share News

kumaram bheem asifabad-ఆగని పశువుల అక్రమ రవాణా

ABN , Publish Date - Nov 14 , 2026 | 10:15 PM

జిల్లా నుంచి పశువుల అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. జిల్లా నుంచి ఏటా వేలాది పాడి పశువులు, వ్యవసాయానికి పనికొచ్చే ఎద్దులు కబేళాలకు తరలిపోతున్నాయి. పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాలకు చెందిన పశువుల వ్యాపారులు జిల్లాకు చెందిన స్మగ్లర్లతో చేతులు కలిపి దొడ్డిదారిన నిత్యం లారీలు, వ్యాన్‌లలో పశువులను అర్ధరాత్రి వేళ సరిహద్దులు దాటించేస్తున్నారు. మహారాష్ట్ర కేంద్రంగా పశువుల అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. జిల్లాలో పోలీసుల నిఘా ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు ఈ దందా చేసే వారు రూట్‌ మార్చేశారు.

kumaram bheem asifabad-ఆగని పశువుల అక్రమ రవాణా
లోగో

- రూట్‌ మార్చిన వ్యాపారులు

- నిఘా ఉన్నప్పటికీ కొనసాగిస్తున్న దందా

కాగజ్‌నగర్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లా నుంచి పశువుల అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. జిల్లా నుంచి ఏటా వేలాది పాడి పశువులు, వ్యవసాయానికి పనికొచ్చే ఎద్దులు కబేళాలకు తరలిపోతున్నాయి. పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాలకు చెందిన పశువుల వ్యాపారులు జిల్లాకు చెందిన స్మగ్లర్లతో చేతులు కలిపి దొడ్డిదారిన నిత్యం లారీలు, వ్యాన్‌లలో పశువులను అర్ధరాత్రి వేళ సరిహద్దులు దాటించేస్తున్నారు. మహారాష్ట్ర కేంద్రంగా పశువుల అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. జిల్లాలో పోలీసుల నిఘా ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు ఈ దందా చేసే వారు రూట్‌ మార్చేశారు. మహా రాష్ట్ర నుంచి బెజ్జూరు- కౌటాల-కాగజ్‌నగర్‌ మార్గం లో నిత్యం నిఘా ఉండడంతో ప్రత్యామ్నాయంగా మహా రాష్ట్ర-పెంచికల్‌పేట్‌- దహెగాం-బెల్లంపల్లి మీదుగా నేరుగా జగిత్యాల, హైదరాబాద్‌ ప్రాంతా లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

- నిబంధనలు ఇలా..

ప్రివెంటేషన్‌ ఆఫ్‌ క్రూసియాల్టీ ఆఫ్‌ ఎనిమల్‌ చట్టం, 1960 ట్రాన్స్‌పోర్టు ఎనిమల్‌ రూల్స్‌, సెంట్రల్‌మోటార్‌ వెహికిల్స్‌ రూల్స్‌ వర్తిస్తాయి. పశువుల యాజమాని వివరాలు, కొనుగోలు రసీదు లేదా యాజమాన్య ఆధారాలు పశువులను తరలించేందుకు అవసరమైన వెటర్నీరి వైద్యుడి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరిగా ఉండాలి. అంటు వ్యాధులు లేవని, ప్రయాణానికి పశువులు ఆరోగ్యం గా ఉన్నాయని ధ్రువీకరించాలి. పశువుల సంఖ్య, వాటి రకం, పంపేవారి, స్వీకరించే వారి వివరాలు తప్పకుండా ఉండాలి. సాధారణ సరుకు రవాణా వాహనంలో ఆరు పశువులకు మించి తరలించరా దు. వాహన ంలో పశువులకు తగినంత స్థలం ఉండాలి, ఒక అటెండెంట్‌ ఉండాలి. ప్రయాణ సమయంలో ఆహారం, నీరు అందించే ఏర్పాట్లు తప్పకుండా ఉండాలి. కానీ అవి ఏమీ పట్టించుకో కుండానే పశువుల తరలింపు జరుగుతోంది.

- ప్రస్తుతం జరుగుతున్నది ఇలా..

ప్రస్తుతం మహారాష్ట్ర కేంద్రంగా పశువుల దందా ఇష్టానుసారంగా జరుగుతోంది. ఒక వాహనంలో కిక్కిరిసి తీసుకెళ్లుతున్నారు. వాహనంలో గాలి ఆడక పశువులు మృత్యువాత పడుతున్నాయి. మార్గ మధ్యలోనే పడేసి దందా నిర్వహకులు వెళ్లి పోతున్నారు. రాత్రి వేళల్లో తీసుకెళ్లుతుండటంతో కనీసం వీటికి మేత, నీరు లేకుండా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు పక్కాగా దృష్టి పెట్టినప్పటికి కూడా మార్గాలు మార్చేసి దందాను కొనసాగిస్తున్నారు. మహారాష్ట్ర మీదుగా పెంచికల్‌పేట్‌, దహెగాం మీదుగా బెల్లంపల్లికి రాత్రికి రాత్రే తరలిస్తున్నారు. బెల్లంపల్లి మీదుగా నేరుగా జగిత్యాల, హైదరాబాద్‌ స్లాటర్‌ హౌజ్‌కు తరలిస్తున్నారు. మార్గ మధ్య చెక్‌ పోస్టులున్న కూడా వాహనాలను జాతీయరహదారి పక్కన పెట్టేసి అధికారులు పోయేంత వరకు కూడా రోడ్డుపైన ఉంచేస్తున్నారు. వేకువ జామునే ఈ దందాను నడిపిస్తున్నారు. అయితే బక్రీద్‌ పండుగ సందర్భంగా జిల్లాలో 11 చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి ఈ దందాపై గట్టి నిఘాను పోలీసులు పెట్టారు. ఈ విషయమై కాగజ్‌నగర్‌ సీఐ ప్రేంకు మార్‌ను వివరణ కోరగా కాగజ్‌నగర్‌ మీదుగా పోనీయకుండా కట్టుదిట్టుమైన చర్యలు తీసుకుంటు న్నట్టు తెలిపారు. సమాచారం అందిస్తే తప్పకుండా కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

- నమోదైన కేసులు..

వాంకిడి మండలం గోయగాం పరిసర ప్రాంతా ల్లో 2025 ఫిబ్రవరి 3న అప్పటి ఎఎస్పీ చిత్తరంజన్‌ నేతృత్వంలో నిర్వహించి దాడుల్లో వంద పశువులను స్వాధీనం చేసుకున్నారు. 2025లో రెబ్బెన బ్రిడ్జి సమీపంలో కంటెయినర్‌లో 24 పశువులను కిక్కిరిసి తరలిస్తుండగా తొమ్మిది పడేసేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్న కేసు నమోదు చేశారు. అలాగే 2025 ఎప్టెంబరు గూడెం అంతరాష్ట్ర చెక్‌ వద్ద మూడు వాహనాల్లో 45 పశువులను తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ సంఘటనలో కూడా పది పశువులకు తీవ్ర గాయాలయ్యాయి. 2025 అక్టోబరు 7న గూడెం గుండా తరలిస్తున్న 27 పశువులను స్వాధీనం చేసుకున్నారు. 2025 ఏప్రిల్‌ 7న సిర్పూరు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న 13 బోలెరే వాహనాల్లో 26 ఎద్దును సరైన పత్రాలు లేవని 13 మందిపై కేసు నమోదు చేశారు. 2026 జూలై 21న జైౖలో వాహనంలో పశువులను తరలిస్తుండగా పోలీసు లను చూసి నిందితులు పరారీ కావడంతో ఆగస్టు 6న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. బెజ్జూరు మండలం సుస్మీర్‌లో ఆగస్టు 30న మహారాష్ట్ర నుంచి కొనుగోలు చేసిన పశువులను ఎలాంటి సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 41 పశువు లను స్వాధీనం చేసుకొని ఆరుగురిని అరెస్టు చేశారు. 2026 నవం బరు 3న కల్వాడ లింగాల నుంచి రాజారాం పల్లి మార్కెట్‌కు అక్రమంగా తరలిస్తున్న పశువులను స్వాఽధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

Updated Date - Nov 14 , 2026 | 10:15 PM