Share News

పశు సంపదతోనే రైతులకు ఆర్థికంగా అభివృద్ధి

ABN , Publish Date - Mar 10 , 2026 | 10:27 PM

రైతులు వ్యవ సాయంతో పాటు అనుబంధంగా పశువులను పెంచుకు ని పశు సంపదను అభివృద్ధి చేసుకుంటే ఆర్థికంగా అభి వృద్ధి సాధించవచ్చునని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు.

పశు సంపదతోనే రైతులకు ఆర్థికంగా అభివృద్ధి
మాట్లాడుతున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

దండేపల్లి మార్చి 10 (ఆంధ్రజ్యోతి): రైతులు వ్యవ సాయంతో పాటు అనుబంధంగా పశువులను పెంచుకు ని పశు సంపదను అభివృద్ధి చేసుకుంటే ఆర్థికంగా అభి వృద్ధి సాధించవచ్చునని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. పశు వైద్య పశు సంవర్థకశాఖ ఆధ్వర్యంలో దండేపల్లి మండలం కోర్విచ్మెలలో మంగళవారం మెగా గాలికుంటు వ్యాధి నివారణ పశువైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభిం చారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ పాడి రైతు ల ఆర్థిక అభివృద్ధి, పశువుల సంక్షేమం దిశగా ప్రభుత్వం గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు పంపిణి కార్యక్ర మాన్ని చేపడుతుందన్నారు. గాలికుంటు వ్యాధి వలన ప శువులకు తీవ్రమైన జ్వరం పాడి పశువులలో పాల ఉత్ప త్తి గణనీయంగా తగ్గడం, పునరుత్పత్తి సామర్థ్యం తగ్గ డంతో రైతులకు అపారమైన ఆర్థిక నష్టం కలుగుతుం దన్నారు. గత సంవత్సరం 100శాతం జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేయడం జరిగిందన్నారు. ఈనెల రోజుల పాటు నిర్వహించే ఉచిత పశువైద్య శిబిరాలను పశుపో షకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పాడి పశువులు, మేకలు,గొర్రెలు, పౌలీ్ట్ర పారాలలో గాలికుంటు వ్యాధి నివారణ దిఽశగా జిల్లా వ్యాప్తంగా పశువైద్యులు, సిబ్బంది, మందులను అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పథకాలు, ప్రణాళికలను లైవ్‌స్టాక్‌ పథకంలో ప్రభుత్వం 50శాతం రాయితీ అంది స్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అఽధికారి డా. యాకుబ్‌రెడ్డి, సర్పంచ్‌ సోనియా-కిరణ్‌, ఎంపిడివో జేఆర్‌ ప్రసాద్‌, పశువైఽధ్యధికారులు డా.ధనరాజ్‌, సుజాత, ఉప సర్పంచు తిరుపతి, నాయకులు వేణు, తిరుపతి, సత్తయ్య, వెంకటేష్‌, పశు వైద్య సిబ్బంది పశుపోషకులు ఉన్నారు.

Updated Date - Mar 10 , 2026 | 10:27 PM