Share News

kumaram bheem asifabad- సమస్యలు ఏకరువు

ABN , Publish Date - Aug 05 , 2026 | 10:54 PM

రైతులకు అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని సభ్యులు డిమాండ్‌ చేశారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో పాటిల్‌ జోత్స్న అధ్యక్షతన బుధవారం నిర్వహించిన మండల పరిషత్‌ సమావేశానికి మండల ప్రత్యేక అధికారి జిల్లా గృహనిర్మాణ శాఖ డీఈ ఎన్‌ టీ ప్రకాష్‌రావు ముఖ్య అతిథిగా హాజరైనారు.

kumaram bheem asifabad- సమస్యలు ఏకరువు
మాట్లాడుతున్న మండల ప్రత్యేక అధికారి ప్రకాష్‌రావు

- ఎరువుల అధిక ధరలు, విద్యుత్‌ సమస్యలు ప్రస్తావన

వాంకిడి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): రైతులకు అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని సభ్యులు డిమాండ్‌ చేశారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో పాటిల్‌ జోత్స్న అధ్యక్షతన బుధవారం నిర్వహించిన మండల పరిషత్‌ సమావేశానికి మండల ప్రత్యేక అధికారి జిల్లా గృహనిర్మాణ శాఖ డీఈ ఎన్‌ టీ ప్రకాష్‌రావు ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సదర్భంగా వ్యవసాయ శాఖ అధికారి గోపికాంత్‌ తన శాఖపై నివేదికలు చదువుతుండగా సభ్యులు కలుగచేసుకోని వ్యాపారులు రైతులకు అధికధలకు ఎరువులు విక్రయిస్తున్న ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. రైతులు తీసుకున్న ఎరువులకు రశీదులు కూడా ఇవ్వడంలేదని చెప్పారు. వ్యాపారులు అధిక ధరలకు ఎరువులు విక్రయించడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని వాంకిడి, బంబార, సర్పంచ్‌లు సతీష్‌, కృష్ణాజీ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఎరువులు విక్రయిస్తున్న దుకాణాలకు తనిఖీలు చేసి అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని సభ్యులు డిమాండ్‌ చేశారు. మండలంలోని పలుగ్రామాల్లో ఐరన్‌ విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగి ప్రమాదకరంగా ఉన్నాయని వాటిని తొలగించాలని సభ్యులు కోరారు. మండలంలోని తెజీగుడ, కనర్‌గాం తదితర గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు, ఆయాలు లేకపోవడతో పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు సక్రమంగా పౌష్టికాహారం అందడంలేదని సభ్యులు ప్రస్తావించారు. వాంకిడి ప్రభుత్వ వైద్యశాలలో సాయంత్రం చికిత్స కోసం వచ్చిన ప్రజలకు రక్త, మూత్ర పరీక్షలు చేయకపోవడతో బయట ల్యాబ్‌లలో పరీక్షలు చేయించి ప్రైవేట్‌ వైద్యుల వద్ద చికిత్సలు చేయించుకోవాల్సి వస్తుందని సభ్యులు వాపోయారు. ఏ చిన్న ప్రమాదం జరిగినా వైద్యశాలకు తీసుకువస్తే చిన్న చికిత్సకోసం కూడా బాదితులను ఆసిఫాబాద్‌ వైద్యశాలకు రెఫర్‌ చేస్తున్నారని వైద్యశాలలో సిబ్బంది పట్టించుకోవడంలేదని సభ్యులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. బంబార గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో సుమారు 95 మందికి పైగా నాన్‌బోర్దర్‌ విద్యార్థులు చదువుకుంటున్నారని వారికి మద్యాహ్న భోజన పథకం అమలు చేయకపోవడంతో ఇళ్లకు వెళ్లి భోజనం చేసి తిరిగి పాఠశాలకు రావాల్సి వస్తుందని బంబార సర్పంచ్‌ కృష్ణాజీ అన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి ఎన్‌ టీ ప్రకాష్‌రావు మాట్లాడుతూ అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మండల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. సమావేశంలో సర్పంచ్‌లు అధికారుల దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు. వచ్చే మండల పరిషత్‌ సమావేశం వరకు సభ్యులు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.. సమావేశంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ జాబిరే పెంటు, ఎంపీడీవో జోత్స్న, తహసీల్దార్‌ కవిత, ఎంపీవో ఖాజా అజీజోద్దిన్‌, ఏసీడీపీవో ఉమా పాతిమా, వ్యవసాయ అధికారి గోపికాంత్‌, ఎంఈవో శివచరణ్‌కుమార్‌, ఐకేపీ ఏపీఎం కోనయ్య, వీబీ జీరామ్‌ జీ ఏపీవో శ్రావణ్‌, వైద్యాధికారి వినయ్‌, హౌసింగ్‌ ఏఈ నాగరాజ్‌, పీఆర్‌ ఏఈ కిరణ్‌, ఇరిగేషన్‌ ఏఈ శివకుమార్‌, విద్యుత్‌, ఆటవీశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2026 | 10:54 PM