Share News

సమస్యలు విని... పరిష్కారానికి మార్గం చూపి...

ABN , Publish Date - Mar 07 , 2026 | 11:42 PM

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా కార్పొరేషన్‌ పరిధిలోని 30వ డివిజన్‌లోని కట్టకొమ్ము గుడిసెల ప్రాంతంలో శనివారం ఎ మ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అధికారులతో కలిసి పర్యటించారు.

సమస్యలు విని... పరిష్కారానికి మార్గం చూపి...
నస్పూర్‌లోని 30వ డివిజన్‌లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్‌ రావు

30వ డివిజన్‌లో పర్యటించిన ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు

నస్పూర్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి) : ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా కార్పొరేషన్‌ పరిధిలోని 30వ డివిజన్‌లోని కట్టకొమ్ము గుడిసెల ప్రాంతంలో శనివారం ఎ మ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అధికారులతో కలిసి పర్యటించారు. కాలనీలోని సమస్యలను విని పరిష్కరించాలని అధికారులను ఆదేశిం చారు. ఈ సందర్భంగా డివిజన్‌ వాసులు పలు సమస్యలను ఎమ్మె ల్యేకు విన్నవించారు. ఊరు శ్రీరాంపూర్‌ వద్ద బస్సులు ఆపకపోవడం వలన ఇబ్బందులు పడుతున్నామని, ఎక్కువ సమయం మంచినీటి సరఫరా చేయాలని, విద్యుత్‌ వైర్లు కిందకు వేలాడుతున్నాయని, వీధి లైట్లు వెలగడంలేదని, కొత్తవి ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలు చెప్పిన సమస్యలను విన్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. అన్ని డివిజన్ల అభివృద్ధి, సౌకర్యాలను కల్పించడానికి ఈ కార్య క్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మే యర్‌ ధర్ని మధుకర్‌, డిప్యూటీ మేయర్‌ సల్లా రమ్య, 30 డివిజన్‌ కార్పొరేటర్‌ కే. శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ అన్వేష్‌తో పాల్గొన్నారు.

Updated Date - Mar 07 , 2026 | 11:42 PM