Share News

లయన్స్‌క్లబ్‌ సేవలు ఆదర్శనీయం

ABN , Publish Date - Apr 03 , 2026 | 11:11 PM

లయన్స్‌క్లబ్‌ సేవలు ఆదర్శనీయమని చెన్నూరు సీఐ బన్సీలాల్‌ పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్‌కుచెందిన డాక్టర్‌ భాస్కర్‌ మడేకర్‌ ఉదార నేత్రవైద్యశాల సౌజన్యంతో వైస్‌ చైర్మన్‌ లయన్‌ సురేష్‌ సహకారంతో చెన్నూరు లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని సీఐ ప్రారంభించి మాట్లాడారు.

లయన్స్‌క్లబ్‌ సేవలు ఆదర్శనీయం
నేత్ర పరీక్షలు చేస్తున్న వైద్యులు

చెన్నూరు, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి) :లయన్స్‌క్లబ్‌ సేవలు ఆదర్శనీయమని చెన్నూరు సీఐ బన్సీలాల్‌ పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్‌కుచెందిన డాక్టర్‌ భాస్కర్‌ మడేకర్‌ ఉదార నేత్రవైద్యశాల సౌజన్యంతో వైస్‌ చైర్మన్‌ లయన్‌ సురేష్‌ సహకారంతో చెన్నూరు లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని సీఐ ప్రారంభించి మాట్లాడారు. లయన్స్‌క్లబ్‌ ద్వారా అనేక సమాజహిత కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. వైద్యశిబిరాలు, రక్తదాన శిబిరాలు, నిరుపేదలకు సహాయ సహాకారాలు అందిస్తున్నారన్నారు. ఈ శిబిరంలో 73 మందికి వైద్యులు నేత్ర పరీక్షలతో పాటు బీపీ, షుగర్‌ పరీక్షలను నిర్వహించారు. కంటి చూపుతో బాధపడుతున్న 40 మందిని గుర్తించి ఆపరేషన్‌ కోసం రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించినట్లు లయన్స్‌క్లబ్‌ ప్రెసిడెంట్‌ జాడి తిరుపతి తెలిపారు. ఆపరేషన్‌లు చేయించుకునే వారికి ఉచిత బస్సు, భోజనం సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోన్‌ చైర్‌పర్సన్‌ వెంకటేశ్వర్‌, కార్యదర్శి శ్రీనివాస్‌, కోశాధికారిగా సాగర్‌, సభ్యులు మహేందర్‌, సతీష్‌గౌడ్‌, దుర్గా ప్రసాద్‌,ప్రకాష్‌బాబు, నాగరాజుగౌడ్‌, సత్యనారాయణ, నవీన్‌, అంగ్రాజ్‌పల్లి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2026 | 11:11 PM