డిపోలకే పరిమితం
ABN , Publish Date - Apr 22 , 2026 | 11:16 PM
ఆర్టీసీలోని జేఏసీ నాయకు ల పిలుపు మేరకు జిల్లాలోని నాలుగు ఆర్టీసీ డి పోల్లో బస్సులు నిలిచిపోయాయి.
- ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు కొనసాగిన సమ్మె
- డిపోలలో నిలిచిన బస్సులు
- డిపోల గేటు ఎదుట ధర్నా.. ఉద్యోగుల ర్యాలీ
కొల్లాపూర్/ అచ్చంపేట/ కల్వకుర్తి, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి) : ఆర్టీసీలోని జేఏసీ నాయకు ల పిలుపు మేరకు జిల్లాలోని నాలుగు ఆర్టీసీ డి పోల్లో బస్సులు నిలిచిపోయాయి. బుధవారం తెల్లవారుజామున ఆయా డిపోల్లో కార్మికులు డిపోల గేటు బయట నిల్చొని బస్సులను బయ టికి వెళ్లకుండా అడ్డుకున్నారు. తమ న్యాయ మైన హక్కులు పరిష్కరిం చేంత వరకు సమ్మె విరమించేది లేదని ఆర్టీసీ కార్మికులు తేల్చి చె ప్పారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని జేఏసీ నాయకులు నినదించారు.
కార్మికుల సమ్మె నేపథ్యంలో కొల్లాపూర్ డిపో నుంచి బస్సులు రోడ్డెక్కలేదు. డిపో బయట ఉ న్న ప్రైవేటు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధి కారులు ప్రయత్నం చేయగా, ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. దీంతో ఆర్టీసీ కార్మికులు డిపో గేటు ముందు ధర్నా చేశారు. బస్టాండ్‌లలోకి బస్సులు రాకపోవడంతో బోసిపోయి కనిపించా యి. అన్ని డిపోలు, బస్టాండ్ల వద్ద స్థా నిక పోలీసులు పహారా కాశారు. కొల్లా పూర్‌లో ఆర్టీసీ కార్మికులు ర్యాలీ నిర్వ హించారు. కొల్లాపూర్ పోలీసు సీఐ శంకర్ నాయక్, ఎస్‌ఐ సురేష్ జోక్యం చేసుకుని పెబ్బేరు - హైదరాబాద్ మీ దుగా నడిపేందుకు రెండు ప్రైవేటు బస్సులను డిపో నుంచి బయటికి తీ శారు. ఈ తరుణంలో ఆర్టీసీ కార్మికులు తీవ్రం గా ప్రతిఘటిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రయాణికుల ఇక్కట్లు
అచ్చంపేటలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రారం భమైంది. అవుట్ సోర్సింగ్ కార్మికులను సైతం విధులకు హాజరు కాకుండా మిగతా కార్మికులు అడ్డుకున్నారు. పోలీసుల సహకారంతో ఆర్టీసీ అధికారులు అచ్చంపేట డిపో నుంచి 14 బస్సు లు ప్రధాన రూట్లల్లో నడిపించారు. అచ్చంపేట డిపోలో కండక్టర్ విధుల్లో చేరేందుకు 20మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది వచ్చినప్పటికీ డ్రైవర్లు లేకపోవడంతో బస్సులను నడపలేని పరిస్థితి. అత్యవసరంగా వెళ్లే ప్రయాణికులు ప్రైవేట్ వా హనాలను ఆశ్రయించారు. అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ, ఎస్‌ఐల ఆధ్వర్యంలో పోలీసు లు బందోబస్తు నిర్వహించారు. అచ్చంపే ట డిపో పరిధిలో ఆరు రూట్లు ఉండగా ప్రతీనిత్యం 30 నుంచి 40వేల మంది ప్ర యాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. మొత్తమ్మీ ద మొదటి రోజు ఆర్టీసీ కా ర్మికుల సమ్మె విజయవం తమైంది.
నిలిచిన ఆర్టీసీ సేవలు
కల్వకుర్తిలో ఆర్టీసీ కా ర్మికులు సమ్మెకు దిగడంతో ఆర్టీసీ సేవలు నిలి చిపోయాయి. బస్సులు డిపోకే పరిమితమయ్యా యి. కార్మికులకు మద్దతుగా బీజేపీ నాయకులు సమ్మెలో పాల్గొన్నారు. ఉదయం 5 గంటల నుం చి డిపో ముందు కార్మికులు ధర్నాకు దిగగా బీజేపీ, సీపీఎం, సీఐటీయూ, కేవీపీఎస్, ఇతర ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలి పారు. డిపో పరిధిలో 9ప్రైవేట్ అద్దె బస్సులు, మూడు ఆర్టీసీ బస్సులు నడిపించినట్లు డిపో మేనేజర్ సుభాషిణి తెలిపారు. మిగతా బస్సుల న్నీ ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితం కావడంతో ప్రయాణికులు నానా అవస్థలుపడ్డారు. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీజేపీ నాయకులు మొగిలి దుర్గాప్ర సాద్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి.ఆంజనే యులు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పరశురాములు, ఆర్టీసీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.