Share News

kumaram bheem asifabad- దీపారాధన.. ప్రత్యేక పూజలు

ABN , Publish Date - Nov 24 , 2026 | 10:50 PM

జిల్లా వ్యాప్తంగా మంగళవారం మహిళలు కార్తీకపౌర్ణమిని పురస్కరించుకుని వేకువజాము నుంచే దీపారాధనలు.. ప్రత్యేక పూజలు చేశారు. ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఆలయాల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. పట్టణంలోని కేస్లాపూర్‌ అంజనేయస్వామి, సాయిబాబా ఆలయం, సందీప్‌నగర్‌ శివాలయం, బాలేశ్వర ఆలయం, అయ్యప్పస్వామి దేవాలయం, కోదాండరా మాలయంలలో భక్తులు దీపాలంకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు

kumaram bheem asifabad- దీపారాధన.. ప్రత్యేక పూజలు
సాయిబాబా ఆలయంలో దీపాలంకరణ చేస్తున్న భక్తులు

ఆసిఫాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా మంగళవారం మహిళలు కార్తీకపౌర్ణమిని పురస్కరించుకుని వేకువజాము నుంచే దీపారాధనలు.. ప్రత్యేక పూజలు చేశారు. ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఆలయాల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. పట్టణంలోని కేస్లాపూర్‌ అంజనేయస్వామి, సాయిబాబా ఆలయం, సందీప్‌నగర్‌ శివాలయం, బాలేశ్వర ఆలయం, అయ్యప్పస్వామి దేవాలయం, కోదాండరా మాలయంలలో భక్తులు దీపాలంకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఇళ్లలో తులసి, ఉసిరి, పత్రి చెట్ల ముందు దీపాలు, వత్తులను వెలిగించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అంతకు ముందు ఉదయం మహిళలు దీపాలతో నగర సంకీర్తన చేపట్టి పెద్దవాగులో గంగాహరతి నిర్వహించారు. మండలంలోని ఎల్లారం గ్రామ ప్రజలు భక్తిగీతాలను అలపిస్తూ శోభాయాత్రగా జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్‌ అంజనేయస్వామి ఆలయం వరకు పాదయాత్రగా చేరుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

కాగజ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని కలెక్టర్‌ కె.హరిత ఈసుగాం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివలింగానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు కలెక్టర్‌ను సన్మానించారు. కాగజ్‌నగర్‌ పట్టణ, మండలంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం పూటనే పలు ఆలయాల్లో దీపాలను వెలిగించారు. అలాగే ఈసుగాం శివమల్లన్న ఆలయంలో శివలింగానికి ప్రత్యేకంగా అలంకరించారు. రాత్రి జ్వాలతోరణం, శివపార్వతుల ఊరేగింపు నిర్వహించారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): ఆలయాలకు కార్తీకశోభ సంతరించుకుంది. మండల కేంద్రంతో పాటు వివిద గ్రామాల్లో మంగళవారం కార్తీక పౌర్ణమి సందర్బంగా భక్తులు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. మండల కేంద్రంలోని రంగనాయక, హనుమాన్‌, శివాలయం, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాల్లో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. తులసి, ఉసిరిక మొక్కలకు పూజలు చేసి వత్తులు వెలిగించారు. దీంతో ఆలయాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

కెరమెరి, (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా కార్తీకపౌర్ణమి వేడుకలు నిర్శహించారు. దీంతో గ్రామాల్లో ఉదయం నుంచే కార్తీక శోభ కన్పించింది. మహిళలు తమ ఇంటి ముందు తులసి కళ్యాణం చేపట్టారు. అలాగే ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కెరమెరి సాగ్వీ పెద్దవాగులో దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. తదితర గ్రామాలకు చెందిన కుమురం భీం బ్యాక్‌ వాటర్‌ సమీపంలో దీపారాధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కెరమెరి శివాలయంలో పూజల అనంతరం అన్నదానం చేపట్టారు.

సిర్పూరు(టి), (ఆంధ్రజ్యోతి): మండలంలో కార్తీక పౌర్ణమి వేడుకలు సిర్పూరు(టి)లో ఘనంగా నిర్వహించారు. శ్రీ బాలాజీ వెంటకేశ్వర ఆలయం, శివాలయంలో కార్తీక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా దీపాలను వెలిగించారు. గోవింద్‌ పూర్‌ హనుమాన్‌ ఆలయం నుంచి శివాలయం వరకు భక్తుల భజాభజంత్రీలతో ఆలయానికి చేరుకున్నారు. సాయంత్రం ఆరు గంటలకు ఆలయం వద్ద కార్తీక దీపాలను అలంకరించారు.

రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): మండలంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచే మహిళల చేరుకొని దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి అన్నీ ఆలయాలు భక్తులతో రద్దీ ఏర్పడింది. పలు చోట్ల తులసి కల్యాణం నిర్వహించారు. ఇళ్ల ఎదుట దీపాలను వెలిగించారు.

కౌటాల, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో మంగళవారం కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రాణహిత నదిలో ఉదయం నుంచి భక్తులు స్నానాలను ఆచరించారు. అలాగే వివిధ ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రావి చెట్టు వద్ద దీపాలను వెలిగించారు. పలు ఇండ్లలో తులసి పూజ కార్యక్రమాన్ని అట్టహాసంగా చేపట్టారు.

చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని ఆయా గ్రామాల్లోని ఆలయాల్లో ఉదయం నుంచే మహిళల చేరుకొని దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి అన్నీ ఆలయాలు భక్తులతో రద్దీ ఏర్పడింద. పలు చోట్ల తులసి కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే తమ ఇండ్ల ముందు దీపాలను వెలిగించారు.

పెంచికల్‌పేట్‌, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో మంగళవారం కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రాణహిత నదిలో ఉదయం నుంచి భక్తులు స్నానాలను ఆచరించారు. అలాగే వివిధ ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రావి చెట్టు వద్ద దీపాలను వెలిగించారు.

తిర్యాణి, (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా కార్తీకపౌర్ణమి వేడుకలు నిర్శహించారు. దీంతో గ్రామాల్లో ఉదయం నుంచే కార్తీక శోభ కన్పించింది. మహిళలు తమ ఇంటి ముందు తులసి కళ్యాణం చేపట్టారు. అలాగే ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిర్యానిలో పలు వాగుల్లో స్నానాలు ఆచరించి దీపారాధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక వివిధ ఆలయాల్లో పూజలు నిర్వహించి దీపోత్సవ వేడుకలను నిర్వహించారు.

దహెగాం, (ఆంధ్రజ్యోతి): ు. మండలంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అలాగే వేకువ జాము నుంచే దీపాలను మహిళలు పూజలు చేసి వెలిగించారు. అలాగే మంలడ కేంద్రానికి సమీపంలో రావులమల్లన్న సమీపంలో మంగళవారం పూజలు చేశారు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని గంగ స్నానం ఆచరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం రోజున రావుల మల్లన్న వద్ద బోనాల పండుగ వద్ద నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు.

Updated Date - Nov 24 , 2026 | 10:52 PM