Share News

నేడు, రేపు తేలికపాటి వర్షాలు

ABN , Publish Date - Feb 24 , 2026 | 04:55 AM

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని, దాని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ...

నేడు, రేపు తేలికపాటి వర్షాలు

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ/హయత్‌నగర్‌/సిద్దిపేట/మహాదేవపూర్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని, దాని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంగళవారం ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, మెదక్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. సోమవారం కామారెడ్డి జిల్లా పిట్లంలో 16.5, ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌లో 14.2, ఆదిలాబాద్‌ జిల్లా భోరాజ్‌లో 13.0, మావ్లాలో 12.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపింది.

Updated Date - Feb 24 , 2026 | 04:55 AM