Share News

విమోచనా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

ABN , Publish Date - Sep 13 , 2026 | 11:22 PM

తెలంగాణ విమోచన దినోత్సవా న్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం పట్టణంలోని బీజేపీ కార్యా లయంలో విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు.

విమోచనా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్‌

బెల్లంపల్లి, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ విమోచన దినోత్సవా న్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం పట్టణంలోని బీజేపీ కార్యా లయంలో విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సెప్టెంబరు 17ను అధికారికంగా నిర్వహిస్తామని ప్రక టించి రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్వహిం చకపోవడం సిగ్గు చేటన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాపాలన దినో త్స వం పేరుతో అసలైన స్వాతంత్య్ర వేడుకల ను మరుగున పడేయడానికి కుట్రలు చే స్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం 2023 నుం చి హైద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వ హిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, జిల్లా కార్యదర్శులు రాచర్ల సంతో ష్‌కుమార్‌, శ్రీధర్‌, పట్టణాధ్యక్షురాలు దార కళ్యాణి, నాయకులు ప్రకాష్‌, రాములు, జిల్లా మహిళ మోర్చా నాయకురాలు సం గీత పాల్గొన్నారు.

Updated Date - Sep 13 , 2026 | 11:22 PM