దేశ సంస్కృతి, సాంప్రదాయాలను కపాడుకుందాం
ABN , Publish Date - Mar 24 , 2026 | 10:07 PM
భారతదేశంలో విభిన్న హిందూ సంస్కృతి సంప్రదాయాలకు నిలయ మని భిన్నత్వంలో ఏకత్వమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షు డు రఘనాథ్ వెరబెల్లి అన్నారు.
మ్యాదరిపేట నుంచి ముత్యంపేటకు హనుమాన్ శోభయాత్ర
దండేపల్లి మార్చి 24 (ఆంధ్రజ్యోతి): భారతదేశంలో విభిన్న హిందూ సంస్కృతి సంప్రదాయాలకు నిలయ మని భిన్నత్వంలో ఏకత్వమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షు డు రఘనాథ్ వెరబెల్లి అన్నారు. మంగళవారం హను మాన్ దీక్షాపరులు, హిందువులు, భక్తుల ఆధ్వర్యంలో మ్యాదరిపేట నుంచి ముత్యంపేట వరకు హనుమాన్ శోభాయాత్ర చేపట్టారు. ముందుగా మ్యాదరిపేట హ నుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు చేపట్టి అక్కడి నుంచి దండేపల్లి, వెంకటాపూర్, చెల్కగూడ ముత్యం పేట వరకు దీక్షాపరుల నృత్యాలతో మహా శోభయాత్ర కొనసాగింది. అనంతరం ముత్యంపేట దుర్గ ఫంక్షన్ హాల్‌లో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజల నడుమ సాము హిక హనుమాన్ చాలీసా పారాయణం చేపట్టారు. అ నంతరం స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా రఘనాథ్ హాజరై మాట్లాడుతూ ప్రతీ ఒక్క హిందువు సోదర భావంతో మెలగాలని, యువత సన్మార్గంలో నడుస్తూ సంస్కృతి సంప్రదాయాలను కాడుకోవాలన్నారు. ఏదేశంలో లేని సంస్కృతి సంప్రదాయాలు మన దేశానికి సొంతమ న్నారు. ఈశోభాయాత్రలో పెద్ద ఎత్తున హనుమాన్ స్వాములు భక్తులు, హిందువులు అధిక సంఖ్యలో తర లివచ్చి హిందువుల ఐక్యత చాటుకున్నారు. మండలం లోని వివిధ గ్రామాలను నుంచి హనుమాన్ దీక్షపరు లు ర్యాలీలో పాల్గొనడంతో రహదారింత కాషాయ మంగా మారింది. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్య క్షుడు రవిగౌడ్, జిల్లా నాయకులు రాజయ్య, ప్రదాన కార్యదర్శు సంతోష్, అనిల్, నాయకులు సురేందర్, తు లసి, శ్రీనివాస్, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు లక్ష్మణ్, మహేష్, శ్రీనివాస్, వెంకటేష్, శేఖర్, దీక్షపరులు, భక్తులు, హిందువులు పాల్గొన్నారు.