Share News

kumaram bheem asifabad- లంచ్‌ బాక్సులో ఆరోగ్యాన్ని సర్దుదాం

ABN , Publish Date - Jul 07 , 2026 | 11:15 PM

ఉదయం హడావుడి లంచ్‌ బాక్స్‌లో ఏదో ఒకటి పెట్టేయాలన్న తొంద ర. పిల్లలు ఇష్టంగా తింటారని నూడుల్స్‌, పాస్తా, ప్యాక్డ్‌ చిప్స్‌ పెడుతుంటారు.. కానీ దీని వల్ల బాక్సులో అనారోగ్యాన్ని సర్ది పంపుతున్నట్టే. ఇందుకు ప్రత్యా మ్నాయంగా పక్కాగా ఆరోగ్యంగా ఉండే వాటిని పెడితే పిల్లల్లో సమతుల్యమైన ఆహారం అందే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఓ వైపు రక్తహీనత, మరో వైపు బాల్యంలోనే ఊబకాయం వంటి సమస్యలు అధికంగా వస్తుంటాయని వైద్యులు చెబుతు న్నారు.

kumaram bheem asifabad- లంచ్‌ బాక్సులో ఆరోగ్యాన్ని సర్దుదాం
లోగో

కౌటాల, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ఉదయం హడావుడి లంచ్‌ బాక్స్‌లో ఏదో ఒకటి పెట్టేయాలన్న తొంద ర. పిల్లలు ఇష్టంగా తింటారని నూడుల్స్‌, పాస్తా, ప్యాక్డ్‌ చిప్స్‌ పెడుతుంటారు.. కానీ దీని వల్ల బాక్సులో అనారోగ్యాన్ని సర్ది పంపుతున్నట్టే. ఇందుకు ప్రత్యా మ్నాయంగా పక్కాగా ఆరోగ్యంగా ఉండే వాటిని పెడితే పిల్లల్లో సమతుల్యమైన ఆహారం అందే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఓ వైపు రక్తహీనత, మరో వైపు బాల్యంలోనే ఊబకాయం వంటి సమస్యలు అధికంగా వస్తుంటాయని వైద్యులు చెబుతు న్నారు. ఇండియ కౌన్సిల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూటిషన్‌ తమ ఆహార మార్గదర్శకాలను పూర్తిగా సవరించాయి. రోజు వారి ఆహారంలో సగం కూరగాయ లు(400 గ్రాములు), పండ్లు(100 గ్రాములు) ఉండాలి. ఇవీ శరీరంలో ఇన్‌ప్లమేషన్‌ పూర్తిగా తగ్గిస్తాయి. రక్తహీనతను అరికట్టడానికి ఆకుకూరల వాడకాన్ని 50 నుంచి 100 గ్రాములకు పెంచాలి. తృణధాన్యాలు, పప్పులు, పాలు 3:1:2:5 నిష్పత్తిలో ఉండేలా చూసుకోవాలి. దీనికి వల్ల పూర్తి స్థాయిలో పోట్రీన్‌ అందు తుంది. చక్కెర ఐదు శాతం కంటే తక్కువగా ఉండాలి. అంటే రోజుకు గరిష్టంగా 25-30 గ్రాములు మించకూడదు. రోజుకు 35 గ్రాముల నూనె గింజలు లేదా డ్రై ఫ్రూట్స్‌ ఇవ్వడం ద్వారా మెదడు వికాసానికి అవసరమైన కొవ్వులు అందుతాయి.

ఇలా చేస్తే ప్రయోజనం..

కూరగాయాలు వేసి రాగి సేమియా/హోల్‌-వీట్‌ పాస్తా వేయించిప ఫూల్‌ మఖానా/పాప్‌ చేసిన జొన్నలు మసాల మజ్జిగ/కొబ్బడి నీళ్లు, బాదం స్టఫ్‌ చేసిన ఖర్చూరాలు ఇంట్లో చేసిన రాగిఓట్స్‌ బార్స్‌ ఆవిరిపై ఉడికించిన సిరిధాన్యాలతో తయారు చేసిన ఇడ్లీలు/బేక్‌ చేసిన వెజ్‌ కట్‌లెట్స్‌ ఇవ్వడంతో రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిని స్థిరీకరిస్తోంది. సోడియం, ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ పూర్తిగా తగ్గుతాయి. మెగ్నిషియం అందుతుం ది. హానికరమైన కార్న్‌ సిరప్‌ దూరమవుతుంది. ఎలకో్ట్రలైట్స్‌ అందుతాయి. ఐరన్‌, మెగ్నిషియం అందు తాయి. రిఫైన్డ్‌ షుగర్‌ ఉండదు. కొవ్వు శాతాన్ని పూర్తి గా తగ్గిస్తోంది. పూర్తి ప్రొటిన్‌ అందుతోంది. పిల్లల రోజువారి తృణధాన్యాలు కోటాలో కనీసం 50 శాతం సిరిధాన్యాలు ఉండాలి. రాగిలో పాల కంటే మూడు రెట్లు ఎక్కువ కాల్షియం(364 ఎంజీ/100 గ్రా) ఉంటుంది. సజ్జలలో ఐరన్‌(8.0 ఎంజీ/100 గ్రా), జింక్‌ సవృద్దిగా ఉండి రక్తహీనతను తగ్గిస్తాయి. జొన్నలు పీసీఓఎస్‌ నియంత్రణకు మేలు చేస్తాయి. వీటిని పిల్లలకు రెండు వారాల గోధుమ పిండి లేదా బియ్యంలో 20-30 శాతం సిరిధాన్యాల పిండి కలిపి రోటీలు, ఇడ్లీలు తయారు చేయాలి. వండే ముందు కచ్చితంగా నానబెట్టిన లేదా మొలకలు వచ్చేలా చేయాలి. దీని వక్షౌ ఐరన్‌, జింక్‌ వంటి ఖనిజాలను శరీ రం సులభంగా గ్రహిస్తోంది. రాగి పిండితో చేసిన డా ర్క్‌ చాక్లెట్‌ కుకీలు(బెల్లం వాడి) లేదా గానుగ నూనె లో పాప్‌ చేసిన జొన్నలు స్నాక్‌గా ఇస్తే పిల్లలు ఇష్టం గా తింటారు.

Updated Date - Jul 07 , 2026 | 11:15 PM