kumaram bheem asifabad- చలో వన భోజనం
ABN , Publish Date - Nov 17 , 2026 | 10:38 PM
: కార్తీకమా సం అనగానే వేలాది జనంతో వనాలు సందడిగా కనిపించేవి. ఊరూవాడా ఒక్కటిగా కదిలి వనంలోకి వెళ్లి సందడిగా గడిపి ఉసిరిక, తులసి మొక్కలకు పూజలు చేసి..సహపంక్తి భోజనాలు చేసి రోజంతా ఆడిపాడేవారు. ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందం, ఆరోగ్య సందేశాన్ని కార్తీక వనభోజనాలు మనకు చాటి చెబుతున్నాయి.
- కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహణకు ఏర్పాట్లు
- నాటికి, నేటికీ కార్యక్రమం తీరులో ఎంతో వ్యత్సాసం
బెజ్జూరు, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): కార్తీకమా సం అనగానే వేలాది జనంతో వనాలు సందడిగా కనిపించేవి. ఊరూవాడా ఒక్కటిగా కదిలి వనంలోకి వెళ్లి సందడిగా గడిపి ఉసిరిక, తులసి మొక్కలకు పూజలు చేసి..సహపంక్తి భోజనాలు చేసి రోజంతా ఆడిపాడేవారు. ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందం, ఆరోగ్య సందేశాన్ని కార్తీక వనభోజనాలు మనకు చాటి చెబుతున్నాయి. దేశ సంస్కృతీ సంప్రదాయాలను, హైందవ ధర్మాన్ని అనుసరించి ఉసిరి చెట్టు కింద కార్తీక దామోదరునిగా శ్రీహరి ప్రతిమను ప్రతిష్టించి ఉసిరికలతో హరిని పూజించి, గోవింద నామస్మరణ చేస్తూ పూజించిన అనంతరం ఆనాటి కాలంలో వనభోజనాలు చేసేవారు. అలా పూర్వం మహర్షులు ఆచరించిన కార్తీక వనభోజనాలను ఇప్పటికీ ఏర్పాటు చేసుకుంటున్నారు. నలుగురితో కలిసి ఆనందిసు ్తన్నారు. వనభోజనాలు అనేవి మన సంస్కృతి, జీవన శైలిలో వచ్చిన మార్పులకు నిదర్శనం.
- కాలానుగుణంగా..
ఒకప్పుడు ప్రకృతి ఒడిలో ఆత్మీయంగా సాగిన వేడుకలు, నేడు ఆధునిక హంగులతో విహారయా త్రలుగా మారాయి. నాటి వనభోజనాలు ఊరి బయ ట ఉన్న మామిడి తోటలు, చెరువు గట్లు లేదా దేవాలయ ప్రాంగణాల్లో జరిగేవి. కానీ కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేటి వనభోజనాలను కొం దరు మామిడి తోటల్లో నిర్వహిస్తుండగా, మరికొం దరు రిసార్టులు, ఫామ్‌హౌస్‌లు, పార్కులు లేదా పర్యాటక కేంద్రాల వద్ద నిర్వహిస్తున్నారు. గతంలో అందరూ కలిసి కట్టెల పొయ్యిపై వండుకునే పులి హోరా, దద్దోజనం, వంకాయకూర, పాయసం తది తర వంటకాలు ఎంతో అద్భుతంగా ఉండేవి. కానీ నేటి వనభోజనాల్లో క్యాటరింగ్ ద్వారా తెప్పించే రకరకాల బిర్యానీలు, ఫాస్ట్ఫుడ్స్ వంటి వాటితో పాటు మాంసాహారాలను వడ్డిస్తున్నారు. గతంలో కోలాటం, అష్టాచెమ్మా, దాగుడుమూతలు, కబడ్డీ, అంత్యాక్షరీ లాంటి సంప్రదాయ ఆటలు ఉండేవి. కానీ ప్రస్తుతం డీజే పాటలు, డ్యాన్సులు, సెల్ఫీలు, రీల్స్, స్మార్ట్‌ఫోన్ గేమ్స్ తదితర ఆటలతో బిజీగా గడుపుతున్నారు. గతంలో కలివిడితనం బంధువులు, ఊరి వారందరు ఒకచోట చేరి కష్టసుఖాలు పంచుకునేవారు. కానీ నేడు కులసంఘాలు, కాలనీ అసోసియేషన్లు, ఉద్యోగ సంఘాలు లేదా ఆఫీస్ కొలీగ్స్‌తో కలయికలకు పరిమి తమయ్యారు. గతంలో తక్కువ ఖర్చులతో అందరూ శ్రమను పంచు కుంటూ సాదాసీదాగా చేసుకునేవారు. కానీ నేడు ఎక్కువ ఖర్చుతో ఈవెంట్ మేనేజర్ల ద్వారా అర్భాటంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుత వనభోజనాలు ప్రజల కోసం కాకుండా కొందరు వారి స్వప్రయో జ నాల కోసం నిర్వహిస్తున్నట్లుగా ఉంది. కనీసం ఇకనె ౖనా ఆయా సంఘాల నాయకులు కులభోజనా లను రాజకీయంగా వాడుకోవద్దని, తద్వారా కులాల మధ్య చీలికలు తీసుకరావద్దని పలువురు కోరుతున్నారు.
- ఎంతో ప్రాధాన్యం..
కార్తీక మాసంలో వనభోజనాలకు ఎంతో ప్రాధా న్యం ఉంది. ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందం, ఆరోగ్య సందేశాన్ని కార్తీక వనభోజనాలు మనకు చాటి చెబుతున్నాయి. దేశ సంస్కృతీ సంప్రదాయాలను, హైందవ ఽధర్మమార్గాన్ని అనుసరించి అనాదిగా వస్తు న్న ఎన్నో పర్వదినాలను మనం పాటిస్తూ వస్తున్నాం. ఇందులో బాగమే కార్తీకమాసంలో జరుపుకునే వన సమారాధన కార్యక్రమం. దీనినే కార్తీక వనభోజ నాలుగా పేర్కొంటారు. పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సభ్యులు,బంధు మిత్రుల సపరివారంగా విందు భోజనాలు చేయడం వెనుక భక్తి ఆధ్యాత్మిక భావనలు దాగి ఉన్నాయి. కేవలం భోజనాలకే పరిమితం కాకుండా ఆట, పాట కబుర్లకు ఇది చక్కటి వేదికగా నిలుస్తోంది. పిల్లలు, పెద్దలలో ఉన్న సృజనాత్మకతను తెలిపేలా క్రీడలు. నృత్యాలు, సంగీత కచేరీలు నిర్వహించడానికి ఇదో మంచి అవకాశం.