ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చెద్దాం..
ABN , Publish Date - Apr 18 , 2026 | 12:22 AM
ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేద్దామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ధర్మపురి నియోజకవర్గంలోని
జగిత్యాల, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేద్దామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ధర్మపురి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వేసవి సెలవుల్లో విద్యాలయాల మరమ్మతు పనులు పూర్తి చేయాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ప్రాథమిక అవసరాలను గుర్తించి నివేదికలు తయారు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశిం చారు. ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అల్పాహారం అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. పలు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు పలువురు ఉపాధ్యాయులు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజాగౌడ్, జిల్లా విద్యాశాఖ అధికారి రాము, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిల్ల వాణి శ్రీనివాస్, ధర్మపురి నియోజకవర్గంలోని ఆయా మండలాల ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.