Share News

చేద్దామా.. సహజ సేద్యం

ABN , Publish Date - Jan 06 , 2026 | 11:23 PM

రైతులను ప్రకృ తి వ్యవసాయం వైపు మళ్లించేందుకు అధికారులు చర్య లు చేపడుతున్నారు. సహజ సేద్యంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అన్నదాతలను సన్నద్ధం చే స్తున్నారు.

చేద్దామా.. సహజ సేద్యం

-ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వ ప్రోత్సాహం

-సేంద్రీయ పంటలపై రైతులకు అవగాహన

-జిల్లాలో కొనసాగుతున్న శిక్షణ తరగతులు

-వానాకాలం సీజన్‌ నుంచి సాగుకు కసరత్తు

నెన్నెల, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : రైతులను ప్రకృ తి వ్యవసాయం వైపు మళ్లించేందుకు అధికారులు చర్య లు చేపడుతున్నారు. సహజ సేద్యంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అన్నదాతలను సన్నద్ధం చే స్తున్నారు. సంప్రదాయ వ్యవసాయాన్ని శాస్ర్తీయ దృక్ప థంతో పునరుద్ధరించడం, పర్యావరణ పరిరక్షణకు దోహ దపడుతూ రసాయన బెడద లేని ఆరోగ్యకర ఆహారాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో కేంద్ర ప్ర భుత్వం జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకాన్ని (నేషన ల్‌ మిషన్‌ ఆన్‌ నేచురల్‌ ఫార్మింగ్‌) ప్రారంభించింది. ఇందులో భాగంగా జిల్లాలో రైతులకు నిఫుణులతో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. సహజ పద్ధతులతో భూ మి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంతో పాటు సాగు ఖర్చు లను తగ్గించుకొని అధిక దిగుబడులు సాధించేలా రైతు లకు అవగాహన కల్పిస్తున్నారు.

-జిల్లాలో 15 క్లస్టర్లు

రైతులు ఏ పంట పండిస్తున్నా.. ఎరువులు, పురుగు మందులు వాడకుండా సహజ పద్ధతిలో సాగు చేయా లన్నది జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకం ముఖ్య ఉ ద్దేశం. ఈ మేరకు జిల్లాలో సాగు విస్తీర్ణాన్ని నిర్దేశించి వ చ్చే వానాకాలం సీజన్‌లో ప్రకృతి వ్యవసాయం చేపట్ట డానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో 15 క్లస్టర్లను గుర్తించి, ఒక్కో క్లస్టర్‌లో 125 మంది రైతులను ఎంపిక చేశారు. 1,875 మంది రైతుల పంటపొలాల నుంచి భూసార పరీక్షల కోసం మట్టి నమూనాలు సేక రించారు. వాటిని పరీక్షల కోసం ల్యాబ్‌లకు పంపించా రు. ఆ పరీక్షల్లో వచ్చే ఫలితాల ఆధారంగా భూమిని స హజ సాగుకు యోగ్యంగా తయారుచేయాల్సి ఉంటుం ది. ఇందుకుగాను రైతులకు ఆరు విడతలుగా శిక్షణ త రగతులు నిర్వహించనున్నారు. రాబోయే వానాకాలం పంటల సీజన్‌ కల్లా ఒక్కో రైతు కనీసం ఒక్కో ఎకరం భూమిలో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

భూసారం ప్రధానం..

పంటల దిగుబడి అనేది ప్రధానంగా నేలసారం, సా గుచేసే రకం, యాజమాన్య పద్ధతులపై ఆధారపడి ఉం టుంది. దీంట్లో కీలక భూమిక పోషించేంది మట్టిలో ని పోషక విలువలు. నేలలో సహజ సిద్దంగా అనేక పోష కాలు ఉంటాయి. వీటి స్థితిగతులను అంచనా వేయ కుండా పదేపదే రసాయన ఎరువులను విచ్చలవిడిగా వాడటం వల్ల సాగుఖర్చు పెరిగిపోవడమే కాకుండా భూమి నిస్సారంగా మారుతుంది. రైతులు, నత్రజని, భాస్వరం, పొటాష్‌ లాంటి ప్రధాన పోషకాలను మాత్ర మే వాడుతున్నారు. మిగతా పోషకాలను నిర్లక్ష్యం చేస్తు న్నారు. ఈ క్రమంలో ముందుగా భూసార పరీక్షలు ని ర్వహించి.. ఆ భూముల్లో కావాల్సిన పోషకాలను సేంద్రీ య పద్ధతిలో అందించడంతో నేల ఆరోగ్యం మెరుగు ప డటంతో పాటు నాణ్యమైన పంటలు పండించేలా అధి కారులు రైతులకు తర్ఫీదునిస్తున్నారు.

- జీవవైవిద్యాన్ని కాపాడుకునేలా..

నేలలో సహజంగా అనంతమైన జీవవైవిద్యం ఉం టుంది. ఒక అంచనా ప్రకారం పిడికెడు ఆరోగ్యమైన మ ట్టిలో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా, శిలీంద్రాలు, వేల సం ఖ్యలో కీటకాలు, పదుల సంఖ్యలో వానపాములు, నులి పురుగులు ఉండి జీవ వైవిద్యాన్ని కొనసాగిస్తాయి. నేల లోని కొన్ని సూక్ష్మజీవులు పంట మొక్కలకు గాలిలోని నత్రజనిని స్వీకరించి అందజేస్తాయి. మరికొన్ని నేలలోని ఖనిజలవణాలను, కరిగించి మొక్కలకు అందజేస్తాయి. ఇంకొన్ని నేలలోని సేంద్రీయ పదార్థాలను కుళ్లిపోయేలా చేసి పోషకాలను అందజేస్తాయి. మిగతావి నేలలోని భౌతిక స్థితిని మెరుగు పరిచి, నేలలోని గాలి, నీరు ప్ర సరణను పునరుద్ధరిస్తాయి. కొన్నిరకాల శిలీంద్రాలు పం ట మొక్కల వేళ్లతో అనుసంధానించబడి నీటిని పోషకా లను అందిస్తూ పంటలను బెట్టనుంచి కాపాడతాయి. ఇన్ని ఉపయోగాలున్న నేలలోని జీవవైవిద్యాన్ని కాపాడు కుంటూ.. పంటలకు ఉపయోగ పడే మిత్రపురుగులు, కీ టకాలను కాపాడుకునేలా సహజ సేద్యం ఉంటుంది.

-సేంద్రీయంతో చేవ

పదేపదే రసాయణ ఎరువులపైన ఆధారపడితే భూ భౌతికస్థితి దెబ్బతిని మేలు కంటే కీడే ఎక్కువ జరుగు తుంది. రైతులు తప్పనిసరిగా సేంద్రీయ ఎరువులను వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పశువుల ఎరువుల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యమ్నాయంగా పచ్చిరొట్ట, పచ్చిఆకురొట్ట పైర్లు, వ్యవసాయ వ్యర్థాలను భూమిలో కలియదున్నడం ద్వారా రైతులు ఆశించిన ఫ లితాలు పొందవచ్చని నిఫుణులు సూచిస్తున్నారు. కుళ్లి న సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు విరివిగా వా డాలి. సహజవనరుల ద్వారా భూసారాన్ని పెంపొం దించాలి. జీవనియంత్రణ పద్ధతులకు, వృక్షసంబంధ మైన కషాయాలకు ప్రాధాన్యమివ్వాలి. గోమూత్రం, గో మలం, ఆకులతో కషాయాలు తయారు చేసి పంటల పైన ఉపయోగించి నాణ్యమైన దిగుబడులు, మంచి ధ రలు పొందవచ్చు. బిజామృతంతో విత్తనశుద్ధి, జీవామృ తంతో పురుగుల అదుపు చేసి ఆశించిన దిగుబడులు సాధించవచ్చు. పంట మార్పిడి విధానం కచ్చితంగా పా టించాలి. ఇలా పలు విషయాలపై నిఫుణులు రైతుల కు పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తున్నారు.

రైతులకు అవగాన కల్పిస్తున్నాం

-సురేఖ, జిల్లా వ్యవసాయ అధికారి

నేల తల్లి ఆరోగ్యమే మన ఆరోగ్యంగా భావించి రైతు లు ప్రకృతి వ్యవసాయం చేయాలి. రసాయన ఎరువు లు, పురుగుమందుల వాడకాన్ని వీడి సహజ సాగు వి ధానాలు అవలంబించాలి. సేంద్రీయసాగు ఆవశ్యకత ను గుర్తించిన ప్రభుత్వం జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకం (నేషనల్‌ మిషన్‌ ఆన్‌ నేచురల్‌ ఫార్మింగ్‌)ను అమలు చేస్తోంది. జిల్లాలో 15 క్లస్టర్లలో ఈ పథకం అ మలుకు రైతుల ఎంపిక పూర్తి అయింది. 1875 మంది రైతులకు మండల స్థాయిలో ఆరు దశల్లో శిక్షణనిచ్చి సేంద్రియ సాగుపై శాస్త్రవేత్తలు, నిపుణులతో పూరిస్థా యి అవగాహన కల్పిస్తున్నాం. ముందుగా సాగు నేలలో రసాయనాల ఆనవాళ్లు గుర్తించేందుకు భూసార పరీక్ష ల కోసం మట్టి నమూనాలు సేకరించాం. పరీక్షల ఫలి తాల ఆధారంగా నేలలో రసాయనాల స్థాయిని బట్టి తీ సుకోవాల్సిన జాగ్రత్తలు, వాడే పోషకాల గూర్చి వివరి స్తాం. వచ్చే వానాకాలం సీజన్‌ నుంచి ప్రకృతి వ్యవసా యం చేసేలా ఎంపిక చేసిన రైతులను ఇప్పటి నుంచే సన్నద్దం చేస్తున్నాం.

Updated Date - Jan 06 , 2026 | 11:23 PM