Share News

kumaram bheem asifabad- అంబేద్కర్‌ చూపిన బాటలో నడుద్దాం

ABN , Publish Date - Oct 21 , 2026 | 11:17 PM

బీఆర్‌ అంబేద్కర్‌ చూపిన బాటలో నడుద్దామని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్‌ అన్నారు. విజయదశమి, ధమ్మ చక్రపరివర్తన్‌ దివస్‌ను మండలంలో అంబేద్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాంకిడి, ఖమన, కనర్‌గాం, బెండార, బంబార, సరండి, ఖిరిడి, ఇంధాని తదితర గ్రామాల్లో పంచశీల్‌ జెండాలను అవిష్కరించారు.

kumaram bheem asifabad- అంబేద్కర్‌ చూపిన బాటలో నడుద్దాం
వాంకిడిలో అంబేద్కర్‌, గౌతమ బుద్ధుడి చిత్రపటాల వద్ద నివాళులు అర్పిస్తున్న బౌద్ధ ఉపాసకులు

వాంకిడి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ అంబేద్కర్‌ చూపిన బాటలో నడుద్దామని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్‌ అన్నారు. విజయదశమి, ధమ్మ చక్రపరివర్తన్‌ దివస్‌ను మండలంలో అంబేద్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాంకిడి, ఖమన, కనర్‌గాం, బెండార, బంబార, సరండి, ఖిరిడి, ఇంధాని తదితర గ్రామాల్లో పంచశీల్‌ జెండాలను అవిష్కరించారు. అనంతరం అంబేద్కర్‌, గౌతమ బుద్ధుడి చిత్రపటాలకు ఫూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1956 అక్టోబరు విజయదశమి రోజున నాగ్‌పూర్‌లోని దీక్షభూమి వద్ద అంబెద్కర్‌ బౌద్ధభిక్షు చంద్రమణి మహాస్థవిరుల చేత బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారని చెప్పారు. అంబేద్కర్‌ చూపిన మార్గంలో ప్రతీ ఒక్కరూ పయనిస్తూ సమానత్వం, సామాజిక న్యాయం, సోదరభావం వంటి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో అంబేద్కర్‌ యువజన సంఘం నాయకులు దుర్గం దుర్గాజీ, దుర్గం శ్యాంరావు, దుర్గం హంసరాజ్‌, విజయ్‌ఉప్రె, విలాస్‌, పాండుజీ, సందీప్‌, ప్రశాంత్‌, విఠల్‌, రాజేశ్వర్‌, శ్యాంరావు దుర్గె, కిరణ్‌, ఖమన సంఘం నాయకులు ఏడీఏ మిలింద్‌, టెమాజీ, యశ్వంత్‌రావు, మారుతి, కిషన్‌, బౌద్ద ఉపాసకులు, రమాబాయి మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు.

బెజ్జూర్‌, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో 70వ ధమ్మచక్ర పరివర్తన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పంచశీల జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌సరోజ-తిరుపతి, వార్డు సభ్యులు కోట రాజన్న, కుల సంఘం పెద్దలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని జై భీమ్‌ నినాదాలతో హోరెత్తించారు.

జైనూర్‌, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో మంగళవారం విజయ దశమి ధమ్మ చక్ర పరి వర్తన్‌ దివస్‌ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడిమెత విశ్వనాథ్‌రావ్‌, జైనూర్‌ మేజర్‌ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ కొడప ప్రకాష్‌, మాజీ సహకార చైర్మన్‌ కొడప హన్నుపటేల్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు షేక్‌ రషీద్‌. సీనియర్‌ నాయకులు మేస్రాం అంబాజీ తదితరులు అంబేద్కర్‌ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంతరం గ్రామ ప్రముఖులు కొడప హన్నుపటేల్‌ పంచశీల్‌ జండాను ఎగురవేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు షేక్‌ రషీద్‌, అంబేద్కర్‌ అసోసియేషన్‌ మండల అధ్యక్షుడుు కాంబ్లే బాబా సాహేబ్‌, దళిత రత్న అవార్డు గ్రహిత మవాలె దత్త తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2026 | 11:17 PM