kumaram bheem asifabad- అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేద్దాం
ABN , Publish Date - Apr 14 , 2026 | 10:39 PM
అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడం, దేశంలోని అన్ని వర్గాల వారికి ఆర్థిక, సామాజిక, న్యాయ, రాజకీయ రంగాలలో సమన్యాయం జరగాలని ఆకాంక్షించిన అంబేద్కర్ ఆశయాల సాధనకు అందరం సమిష్టిగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా షెడ్యుల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి అదనపు కలెక్టర్ డేవిడ్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీష్‌బాబు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనీల్, మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్, కుల సంఘాల ప్రతినిధులు, అంబేద్కర్ సేవా సంఘం, లుంబినీ దీక్ష సేవా సభ్యులతో కలిసి పాల్గొన్నారు.
ఆసిఫాబాద్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడం, దేశంలోని అన్ని వర్గాల వారికి ఆర్థిక, సామాజిక, న్యాయ, రాజకీయ రంగాలలో సమన్యాయం జరగాలని ఆకాంక్షించిన అంబేద్కర్ ఆశయాల సాధనకు అందరం సమిష్టిగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా షెడ్యుల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి అదనపు కలెక్టర్ డేవిడ్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీష్‌బాబు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనీల్, మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్, కుల సంఘాల ప్రతినిధులు, అంబేద్కర్ సేవా సంఘం, లుంబినీ దీక్ష సేవా సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సమాజంలోని అణగారిన వర్గాల అభివవృద్ధి కోసం అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఎమ్మెల్యే హరీష్‌బాబు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు అంబేద్కర్ ఆలోచనలపై దృష్టి సారిస్తున్నాయని అంతటి మేధావి భారత దేశ పౌరుడు కావడం గర్వంగా ఉందని తెలిపారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ ఎనలేని కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు అశోక్, సుగుణక్క, శ్యాంనాయక్, తుకారాం, అశోక్, కేశవరావు, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): గోలేటి సింగరేణి జీఎం కార్యాలయం ఆవరణలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం విజయభాస్కర్‌రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కైరిగూడ ఓసీ, గోలేటి సీహెచ్‌పీ, ఏరియా ఆసుపత్రి, వర్క్ షాప్, స్టోర్స్, ఏజెంట్ ఆఫీస్, ఎంవీటీసీ కార్యాలయం వద్ద జయంతి ఉత్సవాలు నిర్వహించారు. అలాగే గోలేటి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏఎస్పీ చిత్తరంజన్, సీఐ సంజయ్, ఎస్సై వెంకటకృష్ణ పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు మొగిలి, సేవా అధ్యక్షురాలు పద్మా విజయభాస్కర్‌రెడ్డి, అధికారులు నరేందర్, కృష్ణమూర్తి, ఉమాకాంత్, రాజేశ్వర్‌రావు, ప్రశాంత్, శంకర్, అంబేద్కర్, రాజబాబు, నాయకులు మంగిలాల్, సర్పంచ్‌లు బాబురావు, భరద్వాజ్, నాయకులు రవీందర్, సంతోష్, మాత రమాబాయి మండల సభ్యులు పాల్గొన్నారు.
వాంకిడి, (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఖిరిడి, ఇంధాని, ఖమన, కనర్‌గాం, బెండార, బంబార, వాంకిడి తదితర గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు ఫూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్దవిహార్‌లో బౌద్దమహాసభ, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు దుర్గం దుర్గాజీ పంచశీల్ పథాకాన్ని అవిష్కరించారు. ఆయా కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు జైరాం, విజయ్, రాజేశ్వర్, రోషన్, జయంత్‌కుమార్, విఠ్టల్, దుర్గం శ్యాంరావు, ఉపసర్పంచ్ దీపక్‌ముండే, మాజీ జడ్పీటీసీ అజయ్‌కుమార్, బిజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి ఎలగతి సుచిత్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జమాల్‌పురి సుధాకర్, రమాబాయి మహిళ మండలి సభ్యులు గంగుబాయి. ధర్మబాయి, దళిత సంఘం నాయకులు, రమాబాయి మహిళ సంఘ నాయకులు పాల్గొన్నారు.
బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని తహసీల్దార్, ఎంపీడీవో, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో, అంబేద్కర్‌నగర్, ఆదివాసీ భవన్‌లో అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్ సరోజన, ఉప సర్పంచ్ ఆదర్శ, నాయకులు తిరుపతి, సకారాం, జావీద్ అలీ తదితరులు పాల్గొన్నారు.
లింగాపూర్, (ఆంధ్రజ్యోతి) మండల కేంద్రంలోని కరుణ బుద్ధవిహార్‌లో అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్, రమాబాయి మహిళా మండలి సంఘం. అంబేద్కర్ యూత్ అసోసియోషన్ అంబేద్కర్ జయంతిని నర్వహించారు. ముఖ్య అతిథిగా లింగాపూర్ ఏస్సై గంగన్న. స్థానిక సర్పంచ్ .జాదవ్ రాజశేఖర్ హాజరై మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు, సభ్యుతు తదితరులు పాల్గొన్నారు.
జైనూర్, (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొండిబాగూడ, అడ్డెసర్, ఎస్సీ కాలనీ, జైనూర్, జంగాం తదితర గ్రామాల్లో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్, సర్పంచ్ కొడప ప్రకాష్, మాజీ సహకార చైర్మన్ కొడప హన్ను పటేల్, కాంగ్రేస్ పార్టీ జిల్లా ఎగ్జీక్యూటివ్ మెంబర్ పెందుర్ ప్రకాష్, ఎస్‌ఐ రవికుమార్, కరస్పాండెంట్లు జమీల్, ఆసీఫ్, గిత్తె గోపినాథ్, ధళిత రత్న అవార్డు గ్రహీత మోహలె దత్త, వైస్ ఎంపీపీ షేక్ రషీద్ తదితరులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు ఆర్పించారు.
సిర్పూర్(యు), (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు కాంబ్లే భావరావ్, కాంబ్లే కేశవ్, ఆత్రం భగ్వంత్‌రావ్, ఆంధ్రయ్య తదితరులు అంబబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు ఆర్పించారు.
సిర్పూర్(టి), (ఆంధ్రజ్యోతి): బస్టాండు ఏరియాలోని అంబేద్కర్ భవనంలో అంబేద్కర్ సంఘం నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి జెండా ఎగుర వేశారు. బస్టాండు ఏరియాలో, డౌనల్ ఏరియాలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి జెండాలు ఎగురవేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీవో వినోద్, ఈవో తిరుపతి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
దహెగాం, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని అంగడి బజార్ ఏరియా, ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాలు, అయినం, బీబ్రా, ఇట్యాల గ్రామాల్లో అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగడిబజార్ ఏరియాలో ఆత్మ చైర్మన్ టి శ్రీరామరావు అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్ జయలక్ష్మి, నాయకులు భీమన్న, నాగేష్‌గౌడ్, లక్ష్మినారాయణగౌడ్, తిరుపతి, కార్యదర్శి ప్రణీత్, తదితరులు పాల్గొన్నారు.
పెంచికలపేట, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాంచందర్, ఎస్సై అనిల్‌కుమార్‌లు అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. పంచశీల జెండాలను ఎగురవేశారు. కార్యక్రమంలో నాయకులు రాజన్న, శ్రీనివాస్, సదాశివ్, రాజేశ్వర్, చంద్రశేఖర్, లహన్‌రాజ్, ఆశన్న, బాపు పాల్గొన్నారు.
చింతలమానేపలి, (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా మంగళవారం అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలకు పలువురు నాయకులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రధాన వీధుల మీదుగా ర్యాలీ న్విహించారు. పలు గ్రామాల్లో పంచశీల జెండాలను ఆవిష్కరించారు.
కెరమెరి, (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయా కార్యక్రమాలో సర్పంచ్‌లు ఆనంద్‌రావు, ఆత్రం ఆనంద్‌రావు, లక్ష్మణ్, నానేశ్వర్, అంబరావు పాల్గొన్నారు.