Share News

kumaram bheem asifabad- పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం

ABN , Publish Date - Jun 28 , 2026 | 10:13 PM

పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దామని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని రాజంపేట గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు.

kumaram bheem asifabad- పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం
ఆసిఫాబాద్‌లో చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్న కలెక్టర్‌ హరిత

ఆసిఫాబాద్‌రూరల్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దామని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని రాజంపేట గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆసిఫాబాద్‌ జిల్లాను పోలియో రహిత జిల్లాగా తీర్చి దిద్దడానికి అందరు సమిష్ఠిగా కృషి చేయలన్నారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలని తెలిపారు. జిల్లాలో నిర్ధేశించిన లక్ష్యం మేరకు ప్రతి ఒక చిన్నారికి పోలియో చుక్కలు వేయలన్నారు. ఐదు సంవత్సరాలలోపు చిన్నారులందరికి తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ సందర్భంగా పోలియో కేంద్రాల ఏర్పాటు అందుబాటులో ఉన్న వాక్సిన్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కామ్డె అనిల్‌కుమార్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఆకాష్‌, వైస్‌ చైర్మన్‌ ఆహ్మద్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మంగ, సర్పంచ్‌ బుర్స పోచయ్య, తదితరులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): పోలియో రహిత సమాజం కోసం అంతా కృషి చేద్దామని ఎమ్మెల్యే హరీష్‌ బాబు అన్నారు. కాగజ్‌నగర్‌లో పల్స్‌ పోలియో చుక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ షాహిన్‌ సుల్తానా, మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి, కౌన్సిలర్‌ భాగ్యలక్ష్మి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సిర్పూరు(టి), (ఆంధ్రజ్యోతి): పల్స్‌పోలియో కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిర్పూరు(టి) ఎంపీడీవో కోట ప్రసాద్‌ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. మండల కేంద్రంలో పలు కూడళ్లలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మేజర్‌ గ్రామ పంచాయతీ సర్పంచి నాగమణి, ఆరోగ్య శాఖ సిబ్బంది నర్సయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): మండలంలో నిర్వహించిన పల్స్‌పోలియో విజయవంతమైంది. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ఆరోగ్య ఉప కేంద్రాలలో ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో అయా గ్రామ పంచాయతీల సర్పంచులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

జైనూర్‌, (ఆంధ్రజ్యోతి): పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ప్రఈ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడిమెత విశ్వనాథ్‌రావ్‌ కోరారు. మండల కేంద్రంలోని బాలాజీ నగర్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో చైర్మన్‌, సర్పంచ్‌ కొడప ప్రకాష్‌లు చిన్నారులకు పల్‌ పోలియో చుక్కలు వేశారు అంతకు ముందు డీసీసీ అధ్యక్షురాలు సుగుణ పోచంలొద్దిలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్‌లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కెరమెరి/సిర్పూర్‌(యు), (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రాలతో పాటు మారుమూల గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన పోలియో చుక్కలకు చక్కటి స్పందన లభించింది. గ్రామాల్లో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ సర్పంచులతో కలిసి చిన్నారులకు పోలియో చుక్కులు వేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీవోలు అంజద్‌ పాషా, రవిందర్‌, కెరమెరి ఎస్సై, సుధాకర్‌, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

వాంకిడి, (ఆంధ్రజ్యోతి): పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు సహాక రించాలని సర్పంచ్‌ సతీష్‌ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పోలీయో కేంద్రంలో పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ దీపక్‌ముండే, వైధ్యాధికారులు వినయ్‌, రియాజ్‌, హెచ్‌ఈవో రవిదాస్‌, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): మండలంలో పల్స్‌పోలియో కార్యక్రమం అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కూడళల్లో ఏర్పాటు చేశారు. రెబ్బెన ఎస్సై వెంకట కృష్ణ తన కుమారుడిని తీసుకొచ్చి పోలియో చుక్కలు వేయించారు. ఆయా గ్రామ పంచాయతీల్లో సర్పంచిలు పోలియో చుక్కలు వేశారు. ఈ సారి అంగన్వాడీ టీచర్లకు ఓటరు జాబితా సవరణ విదులు అప్పగించడంతో పల్స్‌పోలియో కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. దీంతో కొంత మేర ఇబ్బంది కలిగింది. కాగా రెబ్బెనలో 96 శాతం పూర్తి చేశారు.

దహెగాం (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో పల్స్‌ పోలియో కార్యక్రమం అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ రాపర్తి జయలక్ష్మి ధనుంజయ్‌ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

కౌటాల, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో పల్స్‌ పోలియో కార్యక్రమం ఆదివారం అధికారులు నిర్వహించారు. ఉదయం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం సాయంత్రం వరకు కొనసాగింది. అయితే వంద శాతం పూర్తి చేసినట్టు వైద్య సిబ్బంది పేర్కొన్నారు. ఆయా గ్రామ పంచాయతీల్లో సర్పంచిలు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వంద శాతం పూర్తి చేయటంతో సిబ్బంది ఎంతో కృషి చేశారు.

Updated Date - Jun 28 , 2026 | 10:13 PM