Share News

లెండి ప్రాజెక్టుపై సమావేశం నేడు

ABN , Publish Date - Feb 10 , 2026 | 04:03 AM

మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా ముఖేడ్‌లో మంజీరా నదిపై నిర్మిస్తున్న లెండి ప్రాజెక్టుపై ఎట్టకేలకు కదలిక వచ్చింది. 49 వేల ఎకరాలకు సాగునీటిని అందించడానికి వీలుగా 1985లో దీన్ని చేపట్టారు.

లెండి ప్రాజెక్టుపై సమావేశం నేడు

  • హైదరాబాద్‌లో మహారాష్ట్ర తెలంగాణ అధికారుల భేటీ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా ముఖేడ్‌లో మంజీరా నదిపై నిర్మిస్తున్న లెండి ప్రాజెక్టుపై ఎట్టకేలకు కదలిక వచ్చింది. 49 వేల ఎకరాలకు సాగునీటిని అందించడానికి వీలుగా 1985లో దీన్ని చేపట్టారు. దీర్ఘకాలంగా ఈ ప్రాజెక్టు పెండింగ్‌లో ఉంది. తెలంగాణలో పూర్వ నిజామాబాద్‌ జిల్లాలో 22 వేల ఎకరాలకు, మహారాష్ట్రలో 27 వేల ఎకరాలకు నీరందించాలనేది లక్ష్యం. తెలంగాణకు నీరందించే కుడి కాలువ 35 కి.మీ. దాకా ఉండగా, దీని సామర్థ్యం 6,485 క్యూసెక్కులు. మహారాష్ట్రకు నీరందించే ఎడమ కాలువ 28.46 కి.మీ. దాకా ఉంది. ప్రాజెక్టు ఎర్త్‌ వర్క్‌ 98 శాతం, స్పిల్‌వే 99 శాతం పూర్తయింది. 14 గేట్లకు గాను 13 గేట్లను బిగించారు. తాజా నిర్మాణ అంచనాల ప్రకారం తెలంగాణ వాటా రూ.473.59 కోట్లు. ఇందులో రూ.189.73 కోట్లను చెల్లించింది. మరో రూ.283.86 కోట్లు విడుదల కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో లెండిపై మంగళవారం హైదరాబాద్‌లో మహారాష్ట్ర అధికారులతో అంతర్రాష్ట్ర బోర్డు ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. ఇందులో నిధుల విడుదల తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ కమిటీకి ఛైర్మన్‌గా మహారాష్ట్ర చీఫ్‌ ఇంజనీర్‌, కో ఛైర్మన్‌గా కామారెడ్డి చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌ ఉన్నారు. అంతర్రాష్ట్ర బోర్డు కార్యదర్శిగా విజయకుమార్‌ ఉన్నారు.

Updated Date - Feb 10 , 2026 | 04:03 AM