గరికపాటిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Mar 22 , 2026 | 11:25 PM
విద్యార్థులపై అనుచి త వ్యాఖ్యలు చేసిన గరికపాటి నర్సిం హారావుపై చట్టరీత్యా చర్యలు తీసుకో వాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఎం.తారాసింగ్ డిమాండ్ చేశారు.
- ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి తారాసింగ్
నాగర్‌కర్నూల్ టౌన్, మార్చి 22 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులపై అనుచి త వ్యాఖ్యలు చేసిన గరికపాటి నర్సిం హారావుపై చట్టరీత్యా చర్యలు తీసుకో వాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఎం.తారాసింగ్ డిమాండ్ చేశారు. ఆ దివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ప్ర ముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు గరిక పాటి నరసింహారావు దిష్టిబొమ్మను దహనం చేశారు. తారాసింగ్ మాట్లాడుతూ ప్రభుత్వ పా ఠశాలల్లో చదివే పేద విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా గరికపాటి వ్యాఖ్యలు ఉన్నా యని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్ధిని శోభ నం పెళ్లికొడుకుతో పోల్చడం విద్యార్థి లోకాన్ని అవమానించడమేనన్నారు. దేశవ్యాప్తంగా అమ లవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని అమ లు చేయలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయా న్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వంశీ, చరణ్, సిద్దు, మహేష్, అభినందన్, కార్తికేయ, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.