పొరపాట్లకు తావుండొద్దు
ABN , Publish Date - Nov 12 , 2026 | 11:29 PM
భూ రీసర్వే ప్రక్రియలో ఎలాంటి పొర పాట్లకు తావులేకుండా పక డ్బందీంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ చెన్నయ్య అధికారులను ఆదేశించారు.
- భూ రీసర్వేను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ చెన్నయ్య
లింగాల, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : భూ రీసర్వే ప్రక్రియలో ఎలాంటి పొర పాట్లకు తావులేకుండా పక డ్బందీంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ చెన్నయ్య అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని అంబట్‌పల్లి- మాడాపూర్ గ్రామాల్లో జరుగుతు న్న భూ రీసర్వేను గురువారం ఆయన క్షేత్రస్థా యిలో పరిశీలించారు. అంబట్‌పల్లి పరిధిలోని 6427 ఎకరాలపైన ఉండగా ప్రభుత్వ భూమి 678, 13, పట్టాభూమి 1291 ఎకరాలు, మాడా పూర్ 864.38 ప్రభుత్వ భూమి 199, 29 ఎకరా లు దాదాపుగా పూర్తి కావస్తుందని, పట్టాభూ మి 665,9 ఎకరాలు సర్వే చేయాలని అధికారు లు ఆయనకు వివరించారు. ఆధునిక సాంకేతి కతను వినియోగించి, పాత రికార్డులతో సరిపో ల్చుతూ భూముల వివరాలను ఖచ్చితంగా న మోదు చేయాలని అధికారులకు సూచించా రు. సరిహద్దుల విషయంలో రైతుల సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చే యాలని సూచించారు. కార్యక్రమంలో తహసీ ల్దార్ వెంకటేష్, ఆర్‌ఐ అనిల్, సర్వేయర్ రాంబా బు, జీపీవో రమేష్, సర్వే సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
ఫ బల్మూరు, (ఆంధ్రజ్యోతి) : మండల పరి ధిలోని పోలేపల్లిలో జరుగుతున్న భూముల రీ సర్వేను గురువారం జిల్లా అడిషనల్ కలెక్టర్ చెన్నయ్య పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ భూముల రీ సర్వేను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీ ల్దార్ శ్రీకాంత్, గిర్దావర్ శివరామకృష్ణ, గ్రామ పాలన అఽధికారి విజయ్, అశోక్, వెంకటయ్య, బంగారయ్య, జనార్దన్, లైసెన్స్ సర్వేయర్ రాకేష్, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.