Share News

అభ్యాసనా సామర్థ్యాలను పెంపొందించాలి

ABN , Publish Date - Aug 31 , 2026 | 11:44 PM

ప్రభు త్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యాసనా సామర్థ్యాలను పెం పొందించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. సోమవారం సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో ఎంఈవోలు, కాంప్లెక్స్‌ హెచ్‌ఎంఎలతో సమావేశం నిర్వహించారు.

అభ్యాసనా సామర్థ్యాలను పెంపొందించాలి

ఫ కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి) : ప్రభు త్వ పాఠశాలల్లో విద్యార్థుల అభ్యాసనా సామర్థ్యాలను పెం పొందించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. సోమవారం సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో ఎంఈవోలు, కాంప్లెక్స్‌ హెచ్‌ఎంఎలతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని, విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తుం దన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకంతో చేర్పిస్తున్నారని, వారి నమ్మకాన్ని నిలబెట్టేలా వి ద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్నారు. జిల్లాలో సెం ట్రలైజ్డ్‌ కిచెన్‌ ఏర్పాటు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రతి రోజు అల్పాహారం అందించడంతో పాఠశా లల్లో హాజరు శాతం పెరుగుతుందన్నారు. పిల్లల అభ్యాసన సామర్ధ్యం పెంచే బాధ్యత ఎంఈవోలు, ఉపాధ్యాయులదేనని తెలిపారు. విద్యార్థులకు మల్టీగ్రేడ్‌, మల్టీ లెవెల్‌ టీచింగ్‌ అమ లు చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌, డీఈవో చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

భూ రీసర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి

భూ రీసర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ కార్యాలయం లో రెవెన్యూ సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. భూ సమస్యల పరిష్కారంలో భాగంగా రీసర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. జిల్లాలో 11 నాన్‌ క డస్టల్‌ గ్రామాలు, 70 కడస్టల్‌ గ్రామాల్లో రీసర్వేకు ఎంపిక చే శామన్నారు. గ్రామకంఠం, ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, అటవీ భూములను సాధారణ సర్వేయర్‌, ఆర్‌ఐ, జీ పీవోల ఆధ్వర్యంలో గుర్తించాలన్నారు.

ఈ కార్యక్రమంలో అ దనపు కలెక్టర్‌రాములు, సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌, స్పెషల్‌ డిప్యూ టీ కలెక్టర్‌ చంద్రకళ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ విలాయత్‌ అలీ, సర్వే ల్యాండ్‌ రికార్డు ఏడీ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2026 | 11:44 PM