Share News

kumaram bheem asifabad- విద్యార్థుల్లో అభ్యసన సామార్థ్యాలు మెరుగుపడాలి

ABN , Publish Date - Nov 10 , 2026 | 10:33 PM

ఎఫ్‌ఎల్‌ఎన్‌లో భాగంగా విద్యార్థుల్లో వందశాతం అభ్యసన సామార్థ్యాలు మెరుగుపడే విధంగా ప్రత్యేక కార్యాచరణ పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్‌ హరిత అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో డీఈవో సచ్చిదానందచారితో కలిసి విద్యాశాఖ అధికారులు, హెచ్‌ఎంలతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు.

kumaram bheem asifabad- విద్యార్థుల్లో అభ్యసన సామార్థ్యాలు మెరుగుపడాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిత

ఆసిఫాబాద్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఎఫ్‌ఎల్‌ఎన్‌లో భాగంగా విద్యార్థుల్లో వందశాతం అభ్యసన సామార్థ్యాలు మెరుగుపడే విధంగా ప్రత్యేక కార్యాచరణ పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్‌ హరిత అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో డీఈవో సచ్చిదానందచారితో కలిసి విద్యాశాఖ అధికారులు, హెచ్‌ఎంలతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఎఫ్‌ఎల్‌ఎన్‌ వందశాతం అభ్యసన ఫలితాల సాధనకు మిషన్‌ వందశాతం లెర్నింగ్‌ ప్రత్యేక కార్యాచరణ పకడ్బందీగా అమలు చేయలన్నారు. ఎంఈవోలు, స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు, ప్యానల్‌ ఇన్‌స్పెక్షన్‌ బృందం సభ్యులు పాఠశాలలను సందర్శించి గుర్తించిన అంశాలు పరిశీలనపై సమీక్షించాలని చెప్పారు. విద్యార్థుల్లో చదవడం, రాయడం గణిత సామర్థ్యాలను పెంపొందించడంతో పాటు అభ్యసన స్థాయిలను నిరంతరం పర్యవేక్షిస్తు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద చూపి ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో కోఅర్డినేటర్‌ శ్రీనివాస్‌, ఎంఈవోలు, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.

ఏఎస్‌డీడీ జాబితా ఓటర్ల నమోదుకు మరో అవకాశం

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో బాగంగా ఏఎస్‌డీడీ జాబితా ఓటర్ల నమోదుకు మరో అవకాశం కల్పించింది జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హరిత అన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఎస్‌ఐఆర్‌లో ప్రక్రియలో మ్యాపింగ్‌ ప్రక్రియతో పాటు తదుపరి పరిశీలనలో వివిధ కారణాల వల్ల నమోదు కాకుండా మిగిలిపోయిన అర్హులైన ఓటర్లందరికీ మరో అవకాశం కల్పించిందని చెప్పారు. ఓటరు జాబితాలో పేరులేని అర్హులైన ప్రతీ ఒక్కరు తమ పేర్లను నమోదు చేసుకోవడంతో పాటు అవసరమైన మార్పులు చేసుకునేందుకు ఈనెల 21వ తేది వరకు అవకాశం ఉందని వివరించారు. అర్హులైనవారు నిర్ణీత గడువులోగా అవసరమైన పత్రాలతో దరఖాస్తులు సమర్పించి ఓటరు జాబితాలో తమపేర్లు నమోదయ్యేలా చూసుకోవాలని తెలిపారు. సమావేశంలో డీఆర్వో వేణు, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, ఎన్నికల విభాగం అధికారులు, వివిధ గుర్తింపు పొందిన రాజకీయపార్టీల ప్రతినిదులు తదితరులు పాల్గొన్నారు

Updated Date - Nov 10 , 2026 | 10:33 PM