Share News

ఆత్మస్థయిర్యం కోసం కరాటే నేర్చుకోవాలి

ABN , Publish Date - Feb 22 , 2026 | 11:26 PM

ఆత్మస్ధైర్యం, ఆరో గ్యం కోసం కరాటే నేర్చుకోవాలని నారాయణ స్కూల్‌ కరీంనగర్‌జోన్‌ ఏజీఎం చైతన్యరావు, కరాటే మాస్టర్‌ రంగు శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

ఆత్మస్థయిర్యం కోసం కరాటే నేర్చుకోవాలి

మందమర్రిటౌన్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి) : ఆత్మస్ధైర్యం, ఆరో గ్యం కోసం కరాటే నేర్చుకోవాలని నారాయణ స్కూల్‌ కరీంనగర్‌జోన్‌ ఏజీఎం చైతన్యరావు, కరాటే మాస్టర్‌ రంగు శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఆది వారం పట్టణంలోని శ్రీకృష్ణ ఫంక్షన్‌హాలులో నిర్వహించిన రాష్ట్రస్థాయి క రాటే పోటీల్లో వారు పాల్గొని మాట్లాడారు. ప్రతి సంవత్సరం మందమర్రి లో రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కరాటే క్రీడాకారులు హాజరు కావడం ఆనం దంగా ఉందన్నారు. కరాటేతో మంచి శారీరక ధారుడ్యంతో పాటు క్రమ శిక్షణ కలిగి ఉంటారన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. విజేతలకు బహుమతులు అందిం చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్షల్‌ ఆర్స్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మోహన్‌, సలహదారులు హరికృష్ణ, భూమయ్య, కోశాధికారి వెంకటేష్‌, మాస్టర్లు రమేష్‌రాజా, రమేష్‌, కుమార్‌, వినయ్‌, శేఖర్‌, చిరంజీవి, రా జేష్‌, నరేష్‌, మోహిత్‌, పార్టీల నాయకులు శంకర్‌, రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 22 , 2026 | 11:27 PM