kumaram bheem asifabad- గోపత్తాలేని ఫసల్ బీమా
ABN , Publish Date - May 06 , 2026 | 11:38 PM
విత్తనాలు నాటిన నుంచి పంట చేతికొచ్చి విక్రయించే వరకు రైతులకు కష్టాలే. సాగు సమయంలో వడగళ్లతో కూడిన వర్షం కురిసిందంటే ఇక అంతే. రూ.వేలల్లో పెట్టిన పెట్టుబడి కాస్త నష్టపోవాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో అండగా నిలుస్తుంది పీఎం ఫసల్‌బీమా. రైతులకు భరోసా కల్పించే లక్ష్యంతోనే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. జిల్లా వ్యాప్తంగా 3.50లక్షల ఎకరాల్లో పత్తి, 56వేల ఎకరాల్లో వరి, 20వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేస్తున్నారు. జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, జొన్న, కంది పంటలతో పాటు కూరగాయలు, పండ్ల తోటలను
- రైతుకు దక్కని భరోసా
- విపత్తుల వేళ అందని పరిహారం
బెజ్జూరు, మే 6 (ఆంధ్రజ్యోతి): విత్తనాలు నాటిన నుంచి పంట చేతికొచ్చి విక్రయించే వరకు రైతులకు కష్టాలే. సాగు సమయంలో వడగళ్లతో కూడిన వర్షం కురిసిందంటే ఇక అంతే. రూ.వేలల్లో పెట్టిన పెట్టుబడి కాస్త నష్టపోవాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో అండగా నిలుస్తుంది పీఎం ఫసల్‌బీమా. రైతులకు భరోసా కల్పించే లక్ష్యంతోనే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. జిల్లా వ్యాప్తంగా 3.50లక్షల ఎకరాల్లో పత్తి, 56వేల ఎకరాల్లో వరి, 20వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేస్తున్నారు. జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, జొన్న, కంది పంటలతో పాటు కూరగాయలు, పండ్ల తోటలను సాగు చేస్తున్నారు. ప్రకృతి విపత్తులతో నష్టంవాటిల్లితే పెట్టుబడి దక్కుతుందన్న ఆశతో రైతులు బీమా చేయించుకుంటారు. 2018-19వరకు రాష్ట్రం ఫసల్‌బీమా పథకంలో భాగస్వామిగా ఉండేది. ఆ తర్వాత అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇందులో నుంచి వైదొలిగింది. అప్పటి నుంచి జిల్లా రైతులకు నిరాశే ఎదురవుతోంది. వరికి గ్రామం యూనిట్‌గా, మొక్కజొన్న, కంది, పెసర, మినుము, సోయా, వేరుశనగకు మండలం యూనిట్‌గా బీమా అమలు చేసేవారు. బ్యాంకుల నుంచి రైతులు పంట రుణం తీసుకునే సమయంలోనే వానాకా లంలో 2నుంచి 5శాతం, యాసంగిలో 1.5నుంచి శాతం ప్రీమియం మినహాయించి మిగితా మొత్తాన్ని ఇచ్చేవారు.
- ఏటా నష్టమే..
వేసవిలో వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తుంటాయి. దీనివల్ల వరి, మొక్కజొన్న, కూర గాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. జిల్లాలో వానాకాలంలో వరదలకు, యాసంగిలో వడగళ్లతో కూడిన వర్షాలకు రైతులు సాగు చేసిన పంటలు వేల ఎకరాల్లో దెబ్బతిన్నాయి. ఈ సమయంలో పసల్‌బీమాలో చేరి ఉంటే రైతులకు ఎంతో మేలు జరిగేది. ఇక జిల్లాలో వర్షాకాలంలో ప్రాణహిత తీర ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తున్న పంటలు ప్రతి ఏటా నష్టాలను చవిచూస్తున్నారు. పంట పొలాల్లో భారీగా వరద నీరు చేరి సర్వం కోల్పోయేవారు. నీట మునిగిన పంటలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వక, ఫసల్ బీమా లేక అనేక విధాలుగా రైతులు నష్టపోయేవారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం పీఎం ఫసల్ బీమా పథకంలో చేరకపోవడంతో రైతులకు తీరని నష్టం జరుగుతోంది. సుమారు ఎనిమి దేళ్లుగా రైతులు ఈ పథకానికి దూరంగా ఉన్నారు. ఈ పథకంలో చేరితే విపత్తుల సమ యంలో రైతులకు భరోసా దక్కే అవకాశం ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం ఫసల్‌బీమా పథ కం రైతులకు లబ్ధి చేకూరేలా అవకాశం కల్పించాలని జిల్లా రైతాంగం విజ్ఞప్తి చేస్తోంది.