బాలికల్లో నాయకత్వ లక్షణాలు అవసరం
ABN , Publish Date - May 30 , 2026 | 11:25 PM
బాలికల్లో నాయకత్వ లక్షణాలు అవసర మని, స్థానిక సమస్యల పరిష్కారానికి నా యకత్వంగా వ్యవహరించాలని కలెక్టర్ హే మంత కేశవ్ పాటిల్ అన్నారు.
- కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
నాగర్‌కర్నూల్, మే 30 (ఆంధ్రజ్యోతి) : బాలికల్లో నాయకత్వ లక్షణాలు అవసర మని, స్థానిక సమస్యల పరిష్కారానికి నా యకత్వంగా వ్యవహరించాలని కలెక్టర్ హే మంత కేశవ్ పాటిల్ అన్నారు. కలెక్టరేట్ లో మహిళా వారోత్సవాల ముగింపు సంద ర్భంగా స్నేహ కిశోర బాలికలు నిర్వహిం చిన మాక్ పార్లమెంట్ ఆకట్టుకుంది. మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో బాలికలు వివిధ రాజ్యాంగ పదవులను నిర్వహించారు. కొంత మంది బాలికలు దూర ప్రాంతాలకు బస్సులు లేకపోవడం చదువుకు దూరం అవుతాన్నామని తెలపడంతో అందుకు కలెక్టర్ స్పందించి కిశోర బాలికలకు సైకిళ్లను అందజేయనున్నట్లు తెలి పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేం దర్, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, పీడీ డీఆర్ డీఏ చిన్న ఓబులేష్, అదనపు పీడీరాజేశ్వరి, జి ల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఉమాప తి, అధికారులు, మహిళా సంఘాల నాయకు లు, మహిళలు, విద్యార్థినులు పాల్గొన్నారు.
రైతుల సంక్షేమమే లక్ష్యం : కలెక్టర్
ఉప్పునుంతల, (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం అ మలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమా లు ప్రజలకు పూర్తిస్థాయిలో చేరేలా అధికారు లు సమర్థవంతంగా పని చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచించారు. శనివా రం ఉదయం ఉప్పునుంతల మండలంలోని మామిళ్లపల్లి, లక్ష్మాపూర్ గ్రామాలను సందర్శిం చిన కలెక్టర్ వివిధ ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించారు. ముందుగా మామిళ్లప ల్లి గ్రామంలోని చెరువు కట్టపై కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. జూన్ 1వ తేదీ నాటికి జిల్లాలో మొదటి విడత జనగ ణన ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. తదనంతరం మామిళ్లపల్లి, లక్ష్మాపూర్ గ్రామా ల్లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ రైతులతో మాట్లాడి ధాన్యం కొనుగోలు ప్రక్రియ, తూకం, చెల్లింపుల విధానంపై వివరాలు తెలుసుకున్నారు. అంతకు ముందు మామిళ్లపల్లి గ్రామంలోని పురాతన లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో స్వామిని కలెక్టర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వ హించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సు నీత, ఉప తహసీల్దార్ రమేష్, ఎంపీడీవో వరుణ్‌తేజ్, ఏపీవో పర్వతాలు, ఏపీఎం బా లచంద్రయ్య, మండల వ్యవసాయ అధికా రి రమేష్, సర్పంచ్ మోహన్‌గౌడ్, ఆలయ కమిటీ. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నరసిం హారావు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.