’మునిసిపోల్స్’కు నేతల తాకిడి....
ABN , Publish Date - Feb 09 , 2026 | 12:02 AM
మునిసిపల్ ఎన్నికలను పురస్కరించుకొని జిల్లాలో నేతల తాకిడి క్రమంగా పెరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వివిధ పార్టీల ముఖ్య నాయకులు పోటీలు పడి మరీ తమ తరుపున ప్రచారం చేసేందుకు అగ్రనేతలను ర ప్పించుకుంటున్నారు.
-పోటాపోటీగా ఆహ్వానిస్తున్న నాయకులు
-అభ్యర్థుల్లో రెట్టింపవుతున్న ఉత్సాహం
-ఊపందుకుంటున్న పర్యటనలు
-ఎన్నికల వేళ ముమ్మరవుతున్న ప్రచారం
మంచిర్యాల, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ ఎన్నికలను పురస్కరించుకొని జిల్లాలో నేతల తాకిడి క్రమంగా పెరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వివిధ పార్టీల ముఖ్య నాయకులు పోటీలు పడి మరీ తమ తరుపున ప్రచారం చేసేందుకు అగ్రనేతలను ర ప్పించుకుంటున్నారు. వివిధ పార్టీల ఆధ్వర్యంలో ఏర్పా టు చేసే బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొనేందు కు వస్తున్న ప్రజలకు అభ్యర్థులు ఎంతో కొంత ముట్ట జె ప్పుతుండగా, తమ అభిమాన నాయకులను దగ్గర నుం చి చూసే అవకాశం దక్కుతుందన్న ఉద్దేశ్యంతోనూ అధి క సంఖ్యలో జనం తరలివస్తున్నారు. అగ్రనేతలు పాల్గొ నే సభలు, రోడ్ షోలను విజయవంతం చేసేందుకు స్థా నిక నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రజలను తరలించేందుకు ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
అగ్ర నేతల రాక...
ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ పార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే పలు కార్యక్రమాలకు అగ్ర నేతలు క్యూలు కడుతున్నారు. మునిసిపల్ ఎన్ని కల నామినేషన్ ప్రక్రియ ముగిసిన నాటి నుంచి జిల్లా కు నేతల తాకిడి క్రమంగా పెరుగుతోంది. బీఆర్‌ఎస్ అభ్యర్థుల తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆ పార్టీ అగ్రనేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఈ నెల 6న మంచిర్యాల కార్పొరేషన్‌తోపాటు క్యాతన్‌ప ల్లి, బెల్లంపల్లి మునిసిపాలిటీల్లో పర్యటించారు. ఈ సం దర్భంగా ఏర్పాటు చేసిన రోడ్‌షోల్లో పాల్గొని ఆయన ప్ర జలనుద్దేశించి మాట్లాడారు. అదే రోజు క్యాతన్‌పల్లి ము నిసిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో నూ హరీష్‌రావు పాల్గొన్నారు. అలాగే బీజేపీ అభ్యర్థుల తరుపున ఈ నెల 7వ తేదీన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ జిల్లా కేంద్రానికి వచ్చారు. ఇక్కడ ఏర్పాటు చేసిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఆ పార్టీ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇక్కడ పర్యటించగా, తాజాగా ఆదివారం బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి అబ్బాయి పటేల్ జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థుల తరుపున చేపట్టిన ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ వ్యవస్థాపక అ ధ్యక్షుడు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఈ నెల 7వ తేదీన మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో పర్యటించారు.
కాంగ్రెస్ ఒంటరి పోరాటం....
మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ఒంట రి పోరాటం చేస్తోంది. ఆ పార్టీ అగ్ర నాయకులెవరూ ఇప్పటి వరకు జిల్లాలో పర్యటించలేదు. మూడు నియో జక వర్గాల ఎమ్మెల్యేలు ఎవరికి వారే నిత్యం ప్రజలతో మమేకం అవుతూ అభ్యర్థుల గెలుపును భుజాలకు ఎ త్తుకున్నారు. మంచిర్యాల కార్పొరేషన్‌తోపాటు బెల్లంపల్లి, చెన్నూరు, క్యాతన్‌పల్లి, లక్షెట్టిపేట మునిసిపాలిటీల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు అభ్యర్థులకు అండగా నిలుస్తున్నారు. మంచిర్యాల, లక్షెట్టిపేట మునిసిపాలిటీల పరిధిలో స్థాని క ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, ఆయన సతీమ ణి, డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అలుపె రగకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రేంసాగర్‌రావు కార్నర్ మీటింగ్‌లు ఏర్పాటు చేస్తూ తనదైన శైలిలో ప్ర చారం నిర్వహిస్తుండగా, సురేఖ అభ్యర్థుల తరుపున ఇం టింటా ప్రచారంలో పాల్గొంటున్నారు. చెన్నూరు, క్యాత న్‌పల్లి మునిసిపాలిటీల్లో రాష్ట్ర మంత్రి గడ్డం వివేకా నంద సైతం అలుపెరగని ప్రచారం నిర్వహిస్తున్నారు. అభ్యర్థులకు అండగా నిత్యం వార్డుల్లో పర్యటిస్తూ ప్రజల తో మమేకం అవుతున్నారు. మరోవైపు క్యాతన్‌పల్లి ము నిసిపాలిటీలో డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథరెడ్డి తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. బెల్లంపల్లి మునిసిపాలిటీలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ సైతం ఇంటింటా ప్రచారంలో పాల్గొంటూ అభ్యర్థులకు మనోధైర్యం కల్పిస్తున్నారు.
నూతనోత్సాహంలో కార్యకర్తలు...
వివిధ పార్టీల అగ్రనేతలు జిల్లాకు వస్తుండటంతో ఆయా పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులతోపాటు, కార్యకర్తల్లో నూతనోత్సాహం ఏర్పడుతోంది. జిల్లాలోని ఎన్నికలు జరుగనున్న మునిసిపాలిటీలలో విపరీతమైన పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. అన్ని మునిసిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజీపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ముఖ్యంగా మంచిర్యాల కార్పొరేషన్‌లో పోటీ మరింత తీవ్రంగా ఉంది. మూడు పార్టీల ముఖ్య నేతలు కార్పొరేషన్ పీఠం సొంతం చేసుకోవాలనే తపనతో అలుపెరగని పోరాటం చేస్తున్నారు. అన్ని చోట్లా నువ్వా....నేనా అన్నట్లుగా పోటీ ఉంది. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులకు మద్దతుగా అగ్రనేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. అగ్రనేతల ప్రచార సభలు, కార్యక్రమాలు సక్సెస్ అవుతుండటంతో అభ్యర్థులతోపాటు కార్యకర్తల్లోనూ ఉత్సాహం రోజు రోజుకూ రెట్టింపు అవుతోంది.