Share News

జడ్జిల నియామకాలపై న్యాయవాదుల ధర్నా

ABN , Publish Date - Jun 18 , 2026 | 06:27 AM

తెలంగాణ రాష్ర్టానికి చెందిన న్యాయవాదులనే హైకోర్టు జడ్జిలుగా నియమించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం హైకోర్టు వద్ద న్యాయవాదులు ధర్నా నిర్వహించారు.

జడ్జిల నియామకాలపై న్యాయవాదుల ధర్నా

హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రాష్ర్టానికి చెందిన న్యాయవాదులనే హైకోర్టు జడ్జిలుగా నియమించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం హైకోర్టు వద్ద న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. హైకోర్టుకు జడ్జిలుగా నియామకమయ్యే జాబితాలో ఆంధ్రాకు చెందిన న్యాయవాదుల పేర్లు పరిశీలనలో ఉండటంపై వారు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ వారినే జడ్జిగా నియమించాలని ఇటీవల సర్యసభ్య సమావేశంలో తీర్మానించినట్లు, ఈ విషయమై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయశాఖమంత్రి, గవర్నర్‌, సీఎంలను కలవనున్నట్లు తెలిపారు.

Updated Date - Jun 18 , 2026 | 06:27 AM