Share News

ఎయిర్‌పోర్టు సమీపంలో లేజర్‌ షో

ABN , Publish Date - Apr 02 , 2026 | 03:27 AM

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో కొందరు వ్యక్తులు లేజర్‌ షో నిర్వహించారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక...

ఎయిర్‌పోర్టు సమీపంలో లేజర్‌ షో

  • పోలీసులకు ఫిర్యాదు

శంషాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి) : శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో కొందరు వ్యక్తులు లేజర్‌ షో నిర్వహించారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అవుతున్న హాంకాంగ్‌ నుంచి వచ్చిన సీఎక్స్‌ 673 విమానంపై ఆ లేజర్‌ షో లైట్లు పడ్డాయి. దీంతో కంగారు పడ్డ పైలెట్‌ ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. ఏటీసీ సమాచారంతో ఎయిర్‌పోర్ట్‌ అధికారులు అక్కడి ఔట్‌ పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 02 , 2026 | 03:27 AM